Coconut Adulteration: నేటి ఆధునిక ప్రపంచంలో, కల్తీ లేని ఆహారం దొరకడం ఒక సవాలుగా మారిపోయింది. మార్కెట్‌లో లభించే పాలు, పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, చివరకు మనం నిత్యం వాడే మసాలా దినుసులు, పళ్లు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే టూత్ పేస్టులు ఇలా ప్రతిఒక్కటీ కల్తీ అవుతూనే ఉన్నాయి. లాభాల కోసం ఆహార నాణ్యతను తగ్గించేందుకు విషపూరితమైన రసాయనాలు, రంగులు, ఇతర కలుషిత పదార్థాలను కలపడానికి వ్యాపారులు ఏమాత్రం సంకోచించడం లేదు. ఇందుకు సంబంధించిన వార్తలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు, ఫొటోలు భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియోనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వీడియో కల్తీ జరుగుతుందని ఊహించలేని కొబ్బరి బొండాలకు (Coconut Adulteration) సంబంధించినది కావడం గుబులు పుట్టిస్తోంది.
కొబ్బరి పిందెలకు ఇంజెక్షన్
‘ఎక్స్’లో వైరల్‌గా మారిన ఆ వీడియోలో, ఓ వ్యక్తి చెట్టుపై ఎదుగుదల దశలో ఉన్న కొబ్బరి పిందెలకు ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నాడు. ఆ ఇంజెక్షన్ పసుపు రంగులో ఉంది. ‘‘రోజువారీ జీవితాల్లో మసాలా దినుసులు, పాలు, పండ్లు, కూరగాయలు, నూనెలు, ఇలా ఏది కాదు ప్రతితీ కలుషితం అవుతూనే ఉంది. కనీసం కొబ్బరి నీళ్లైనా కల్తీ లేకుండా సురక్షితంగా ఉంటాయనుకున్నాను. మనం ప్రతిదీ మన పెరటిలోనే పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కానీ, ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నవాళ్లు అపార్ట్‌మెంట్లు కట్టేస్తున్నారు కదా’’ అని ఈ వీడియో షేర్ చేసినవారు రాసుకొచ్చారు. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తారా?, నమ్మలేకపోతున్నామంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Jaish e Mohammed: మహిళలకూ జిహాదీ కోర్సులు.. ఫీజు రూ.500 మాత్రమే.. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కుట్ర
నిజంగానే ఇంజెక్షన్లు ఇస్తారా?
కొబ్బరి బొండాల విషయంలో నీళ్ల రుచి, లేదా బొండాల రంగును ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని దేశాల్లో ఇంజెక్షన్లు ఇస్తుంటారు. సాధారణంగా స్వీట్నర్స్ లేదా, చక్కెర ద్రావణాలు ఈ విధంగా ఎక్కిస్తుంటారు. వాటి ద్వారా నీళ్ల రుచి పెరిగి, వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించవచ్చని కొందరు మోసపూరిత పద్ధతిని ఎంచుకుంటుంటారు. కొన్నిసార్లు కొబ్బరి కాయపై పసుపు (లేదా కాషాయం) రంగును మరింత ఆకర్షణీయంగా రంగులను (Colouring Agents) ఉపయోగిస్తారు.
ఈ వీడియో నిజమైనదేనా?
అయితే, ఈ దృశ్యంలో ఉన్న పసుపు రంగు ద్రవం ఎక్కువగా తీపి పదార్థాల ద్రావణం అయ్యే అవకాశం ఉంది. అనైతిక పద్ధతిలో కొబ్బరి బొండాల తీపిని కృత్రిమంగా పెంచడు ఆహార భద్రతా ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమైంది. ఇక వైరల్‌గా మారిన ఈ వీడియో నిజమైనదో కాదో తెలియదు. ఒకవేళ నిజమైనదే అయితే ఎక్కిస్తున్న ఇంజెక్షన్ పసుపు రంగులో ఉండడాన్ని బట్టి చూస్తే స్వీట్నర్ కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొబ్బరి నీళ్లు మరింత తియ్యగా ఉండేలా ఈ పద్ధతిని ఎంచుకొని ఉండొచ్చు.
Read Also- YS Jagan Trolled: ఏంటీ?.. వైఎస్ జగన్ లేడీస్ షూస్ వేసుకుంటున్నారా?.. నిజమెంత?, వాటి రేటు ఎంత?
నెటిజన్లు భిన్నాభిప్రాయాలు!
కొబ్బరి బొండాలకు ఇంజెక్షన్ ఇస్తున్నట్టుగా ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కలుషితానికి కాదేదీ అనర్హం అని కొందరు కామెంట్ చేశారు. ‘మనకు మనమే గొయ్యి తీసుకుంటున్నాం’ ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, కొందరు మాత్రం ఇదొక ఫేక్ వీడియో అంటున్నారు. వ్యూస్ కోసం ఇలా చేశారని చెబుతున్నారు. ‘‘వాళ్లు ఎక్కిస్తున్న కెమికల్ ఏంటో మీకు తెలుసా?, తెలిస్తేనే ఇలాంటివి పెట్టండి, లేకపోతే వద్దు’’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
I thought coconut water is safe from adulteration. We have contaminants in daily essentials like spices, milk, fruits, vegetables, oils, and what not. Guess we have to grow everything in our backyards but independent houses are making way for apartments. pic.twitter.com/YN4p7dVNK6
— Hi Secunderabad!! (@ApnaSecbad) October 21, 2025
