Viral Video: ఇటీవలే ఎప్పుడూ ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎందుకంటే, రోజుకొక ఘటన వెలుగులోకి వస్తుంది. అయితే, ఇప్పటి వరకు భర్తలు భార్యల్ని అనుమానించి కోపంతో దారుణంగా హత్యలు చేసిన ఘటనలు చాలానే చూశాము. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. భర్తల మీద భార్యలు హద్దులు దాటి మరి ప్రవర్తిస్తున్నారు. నెట్టింట, ఇలాంటి వీడియోలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి.
Also Read: Miss World Contestants: నల్గొండకు రానున్న ప్రపంచ అందాల తారలు.. చూసేందుకు మీరు సిద్ధమా!
అంతేకాకుండా.. కొద్దీ రోజుల క్రితం ఢిల్లీలో ఓ వ్యక్తి భార్య నిత్యం వేధిస్తోందని భరించలేక ఒక వీడియో రిలీజ్ చేసిఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం, నడి రోడ్డు మీద భార్య, భర్తను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు, ఆమె అతన్ని ఎందుకు కొట్టిందో ఇక్కడ తెలుసుకుందాం..
ఓ మహిళ తన భర్తను నడి రోడ్డు మీద చెంపదెబ్బ కొట్టిన వీడియో అందర్ని షాక్ కి గురి చేస్తుంది. ఇద్దరూ సరుకులు కొందామని ఓ దుకాణం వద్దకు వచ్చారు. తీరా బిల్ కట్టే సమయానికి భర్తను బయటకు తీసుకొచ్చి మరి కొట్టింది. తన భర్త సంపాదించడం లేదని, ఆర్థికంగా తనపై ఆధారపడుతున్నాడనే కోపంతో ఇలా చేశానని చెబుతుంది. అతనిని పదే పదే చెంపదెబ్బ కొడుతూ, అరుస్తుండగా, ఆ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా పక్కన ఉన్నవారు ఏం పట్టించుకోకుండా సినిమా చూసినట్టు ఆ దృశ్యాన్ని చూస్తూ ఎవరూ జ్యోక్యం చేసుకోలేదు.
Also Read: Black Magic: అర్థ రాత్రి అయితే చాలు ఆ ఊర్లల్లో హడల్.. వణికిపోతున్న ప్రజలు.. అక్కడ ఏం జరుగుతుందంటే?
ఈ వీడియో పై నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ” ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ, రోడ్డు మీద ఎందుకు ఈ పంచాయితీ బహిరంగంగా మీ భర్తను చెంపదెబ్బ కొట్టడం నేరం ” అంటూబాధితుడికి సపోర్ట్ చేస్తున్నారు.
Also Read: TG AI Engineers: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లకై సర్కార్ కసరత్తు..
” అతను తన ఆదాయాన్ని కోల్పోయాడు, తన గౌరవాన్ని కాదు. భర్త సంపాదించడం లేదని దాడి చేస్తున్న నడి రోడ్డు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు ప్రతి మనిషి గౌరవానికి అర్హుడు” అని ఆమె పై మండిపడుతున్నారు.