Uppal Balu ( Image Source: Twitter)
Viral

Uppal Balu: ఆమె ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా.. ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్

Uppal Balu: ఉప్పల్ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే లేడీ అఘోరి గురించి మాట్లాడుతూ చాలా ఫేమస్ అయ్యాడు. అఘోరి గురించి రోజుకొక వీడియో షేర్ చేస్తూ జనాల్లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నాడు. అఘోరి అమ్మ గురించి మాట్లాడిన వీడియోస్ మొత్తం మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈవెంట్స్, షోస్ కి అటెండ్ అవుతూ .. మధ్య మధ్య లో యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉప్పల్ బాలు పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Also Read:  Gram Panchayat Palana Book: తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై లోతైన విశ్లేషణ.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క!

కుంభమేళాలో ఒక అమ్మాయి చాలా ఫేమస్ అయింది. మీకు తెలుసా కదా మోనాలిసా.. ఆమె మీద ఏమైనా క్రష్ కలిగిందా ? అంటే నీకు అమ్మాయిలను చూస్తే ప్రేమ కలుగుతుందా? మోనాలిసాను పెళ్లి చేసుకుంటావా ? ఇప్పటికిప్పుడు మోనాలిసా వచ్చి ఒక ప్రపోజల్ పెట్టి బాలు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అంటే నువ్వు ఆమెను చేసుకుంటావా? అని యాంకర్ అడగగా .. ఉప్పల్ బాలు దానికి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు.

Also Read: BPNL Recruitment 2025: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో వేల సంఖ్యలో జాబ్స్.. డోంట్ మిస్

ఉప్పల్ బాలు మాట్లాడుతూ ” తను ఒప్పుకుంటే నాకు ఓకే .. ఆ అమ్మాయి పెళ్లికి రెడీ అంటే నేను ఎందుకు కాదంటాను చెప్పు. ఆ అమ్మాయి కష్ట పడి పని చేసింది మాత్రమే తింటుంది. ఎవరి మీద ఆధారపడలేదు. అంత ఫేమస్ అయిన తను చేసే పనిని మాత్రం ఆపలేదు. కుంభ మేళాలో వరుసగా మూడు రోజులు క్రేజ్ పెరిగిపోయింది. ఇంకేముంది ఫేమ్ వచ్చింది.. దీన్ని క్యాష్ చేసుకుని డబ్బు సంపాదిద్దాం అని అనుకోలేదు. మళ్లీ తన వృత్తిని తాను చేసుకుంటుంటే అందరూ ఆమె మీద పడ్డారు. ఇక అప్పుడు చేసేదేమి లేక వాళ్ళ నాన్న ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె కష్టానికి నేను ఫిదా. ఆమె హార్డ్ వర్క్ చాలా నచ్చింది. మరి అలాంటి అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే .. ఎందుకు నో చెబుతా.. వెంటనే మూడు ముళ్ళు వేస్తా ” షాకింగ్ కామెంట్స్ చేసి యాంకర్ కి గట్టి కౌంటరే ఇచ్చాడు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!