Uppal balu on Aghori: ఉప్పల్ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే లేడీ అఘోరి గురించి మాట్లాడుతూ చాలా ఫేమస్ అయ్యాడు. అఘోరి గురించి రోజుకొక వీడియో షేర్ చేస్తూ జనాల్లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నాడు. అఘోరి అమ్మ గురించి మాట్లాడిన వీడియోస్ మొత్తం మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈవెంట్స్, షోస్ కి అటెండ్ అవుతూ .. మధ్య మధ్య లో యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లో లేడీ అఘోరి గురించి ఉప్పల్ బాలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: Minister Ponnam Prabhakar: ఆర్టీసీని దేశంలోనే నెంబర్ వన్ చేస్తాం.. మంత్రి పొన్నం ప్రభాకర్
ఉప్పల్ బాలు షేర్ చేసిన వీడియోలో ” అఘోరిని ఏ జైల్లో వేయాలో తెలియక చెకప్ కు తీసుకెళ్లినందుకు నాకు నవ్వు వస్తుంది. తనని ఏ జైల్లో కాదు .. ఎవరి లేని జైల్లో వేస్తే భలే ఉండేది. ఇంత మోసం చేసింది .. ఎంత మందిని తిట్టింది అఘోరి. అది అసలు అఘోరినే కాదు. దొంగ అఘోరి. ఇప్పుడు మంత్రం చెయ్.. ఓం భీమ్ అను .. త్వరగా బయటకు వస్తావ్ అంటూ మండి పడింది. అయిన నువ్వు జైలుకి పోతావ్ అని అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తావ్.. వర్షిణి ఇంటికి వెళ్ళమని చెప్పొచ్చుగా .. నాతో ఉంటే కష్టాలు వస్తాయి. మీ అమ్మా నాన్నలతో హ్యాపీగా ఉండు అని చెప్తే నీ సొమ్ము ఎమన్నా పోతుందా ? అని అన్నాడు. నువ్వు ఎలాగో జైలు నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఆ అమ్మాయి రోడ్ మీదే అలాగే ఉండాలా? అని అంటూ ” ఆమెకు సపోర్ట్ గా మాట్లాడింది.
Also Read: Sekhar Master: ఆమెతో నాకు లింక్ పెట్టారు.. ఎంకరేజ్ చేస్తా.. శేఖర్ మాస్టర్ కామెంట్స్
ఇంకా ఉప్పల్ బాలు మాట్లాడుతూ నీ ఐఫోన్ , నీ కారు ఎవరికి ఇచ్చావ్? ఇప్పుడు ఆ రెండు ఎవరు మెయింటైన్ చేస్తారు. నీ లిప్ స్టిక్ ను పట్టుకెళ్ళావా జైలులోకి .. రోజూ అక్కడ కూడా లిప్ స్టిక్ ను వేసుకుంటావా ఏంటి ? అక్కడికి కూడా పతివ్రత లాగా తయారైందమ్మా అంటూ మాటలతో విరుచుకుపడింది. జైలు దగ్గరకు వస్తా.. ఏ జైల్లో ఉన్నావో ? వచ్చి నాలుగు లిప్ స్టిక్ లు ఇస్తాను .. మంచిగా రెడీ అవ్వు .. ఆ తర్వాత నీ సంగతి చెబుతా ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు