Viral Video(image credit:AI)
Viral

Viral Video: ఈజీ టెక్నిక్‌తో సిక్స్ ప్యాక్.. వీడియో వైరల్!

Viral Video: బిజీ బిజీ లైఫ్‌తో నేటితరం యువత చాలా వరకు రకరకాల నాణ్యతలేని ఫుడ్స్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అలా తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి చాలామంది జిమ్‌లకు వెళ్లి గంటల కొద్ది సాధన చేస్తారు. జిమ్‌కి వెళ్లడం వల్ల మంచి శరీరాకృతి మాత్రమే కాకుండా ఆరోగ్యంతో పాటు మానసికంగా ధృడంగా అయ్యేలా చేస్తుంది.

జిమ్‌లలో 6 ప్యాక్ అబ్స్, 8 ప్యాక్ అబ్స్ తో పాటు అనేక రకాల ట్రైనింగ్స్ తీసుకుంటారు కానీ అవి అందరికి సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే అది ఎంతో కఠోర శ్రమతో కూడుకున్న పని.. అలాంటి పరిస్థితిలో జిమ్ కి వెళ్లకుండా సులభ పధ్దతిలో 6 ప్యాక్ సాధించాడో బాలుడు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సిక్స్ ప్యాక్ అబ్స్ ఎలా పొందాలో ఆ బాలుడు మంచి టెక్నిక్ చెప్పాడు. అదేమిటంటే.. ఎవరూ డైట్ చేసుకుంటూ జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఆ బాలుడు కొన్ని వైర్ల సహాయంతో సిక్స్ ప్యాక్ అబ్స్ తయారు చేసుకున్నాడు. తన స్నేహితుడి సహాయంతో తన కడుపు పై వైర్లతో బిగ్గరగా కట్టుకోవడంతో పొట్ట బయటికి రాకుండా అలాగే ఉంటుంది.

Also read: Viral News: పెళ్లి లో డబ్బు వర్షం.. ఏరుకున్నోళ్ళకి ఏరుకున్నంత.. డబ్బే డబ్బు!

అలా తన కడుపుపై సిక్స ప్యాక్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ ఆ వైర్లు కనపడకుండా దాచిపెడితే ఆ అబ్బాయికి నిజంగానే ఉన్నాయని మనకు అనిసిస్తుంది. అలా తనకు వచ్చిన సిక్స్ ప్యాక్ బాడీతో పెద్ద బాడీ బిల్డర్ లాగా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

@_noughty_nehu అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో షేర్ చేసిన ఈ వీడియో పై నెటిజన్లు, సిక్స్ ప్యాక్ కాదు 12 ప్యాక్ అని, దేశీ టెక్నాలజీ అని మరొకరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు