bus ( Image Source: Twitter)
Viral, తెలంగాణ

TGSRTC Lucky Draw : బస్సు ఎక్కండి.. గిఫ్ట్ పట్టండి.. టీజీఎస్ఆర్టీసీ దసరా లక్కీ డ్రా..!

TGSRTC Lucky Draw : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు దసరా పండుగ సందర్భంగా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సారి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు కోసం ఒక లక్కీ డ్రా పెట్టింది. దీనిలో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందివ్వనుంది.

ఈ లక్కీ డ్రా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6, 2025 వరకు జరుగుతుంది. TGSRTCకి చెందిన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్-ఏసీ, అలాగే అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈ డ్రాలో ఫ్రీగా పాల్గొనొచ్చు. బస్ లో ప్రయాణికులు తమ టికెట్‌పై పూర్తి పేరు, ఫోన్ నంబర్ రాసి, ప్రయాణం ముగిసిన తర్వాత బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో వేయాలి. ఈ లక్కీ డ్రా కేవలం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 మధ్య చేసిన ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.

Also Read: Local Body Elections: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జోరుగా చర్చ.. రిజర్వేషన్లపై ఆశలు, ఆందోళనలు

రిజర్వేషన్ ద్వారా బస్సు లో ప్రయాణం చేసే వారు కూడా ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. లక్కీ డ్రా తర్వాత, డ్రాప్ బాక్స్‌లను సంబంధిత రీజియనల్ మేనేజర్ (ఆర్ఎం) కార్యాలయాలకు తరలించి, అక్టోబర్ 8న ప్రతి రీజియన్‌లో డ్రా నిర్వహించబడుతుంది. ఒక్కో రీజియన్ నుంచి ముగ్గురు ప్రయాణికులను లక్కీ డ్రా లో ఎంపిక చేసి విజేతలగా.. ప్రకటించనున్నారు. వీరికి నగదు బహుమతులతో పాటు సన్మానంచేయనున్నారు.

Also Read: OG Movie Ticket Hike: ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై.. తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని మంత్రి ఫైర్

మొత్తం 11 రీజియన్లలో 33 మంది విజేతలకు రూ. 5.50 లక్షల విలువైన బహుమతులు అందించనున్నారు. ప్రతి రీజియన్‌లో మొదటి బహుమతి రూ. 25,000, రెండో బహుమతి రూ. 15,000, మూడో బహుమతి రూ. 10,000గా నిర్ణయించారు. TGSRTC ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, ఈ దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పాల్గొనాలని కోరారు. దీని గురించి మీకు మరింత సమాచారం కావాలంటే.. TGSRTC కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లేదా స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు.

Also Read: Norma Movie: అత్తతో అల్లుడి రహస్య బంధం.. ఊపేస్తున్న సినిమా.. సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెట్టిన ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశాన్ని అందిపుచ్చుకోండి.

Just In

01

Telangana Education: ప్రభుత్వం మరో సంచలనం నిర్ణయం.. కేజీబీవీల ఆధునీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. డాక్టర్‌ ఉమర్‌ ఫోటోతో కొత్త ఆధారాలు వెలుగులోకి

Neutral Voters: తటస్థ ఓటర్లపై అన్ని పార్టీల దృష్టి.. అందరి చూపు అటువైపే..!

Delhi Red Fort Blast: ఢిల్లీ బాంబు పేలుళ్లపై సినీ తారల సంతాపం

TGCIIC: రాయదుర్గంలో చదరపు గజానికి రూ.3,40,000 పలికిన భూమి ధర..!