Viral News (image credit:AI)
Viral

Viral News: తెలంగాణలో వింత పరిస్థితి.. అసలు విషయం తెలిస్తే.. ఔరా ఔరా అనాల్సిందే..

Viral News: తెలంగాణ బడ్జెట్ ను బుధవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ సంధర్భంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో జనాభా కంటే, వాటి సంఖ్య అధికంగా ఉందని బహిర్గతమైంది. జనాభా కంటే ఏదో తక్కువ సంఖ్యలో వాటి సంఖ్య ఉందని అనుకుంటే పొరపాటే. లక్షల్లో తేడా ఉండడంతో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకు తెలంగాణలో జనాభా కంటే ఎక్కువగా ఉన్నవి ఏమిటి? వాటి లెక్క ఏంటి? తెలుసుకుందాం.

నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైనది ఏమిటని అడిగితే.. వచ్చే సమాధానం సెల్ ఫోన్. చాలా వరకు కొంత మంది 2 ఫోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. నిత్యావసర పరికరాలలో మొబైల్ ఒకటి చేరిపోయింది. మారిన కాలానుగుణంగా మొబైల్ ఫోన్ అవసరం కూడా అంతే పెరిగింది. క్షణాల్లో సమాచారం తెలుసుకొనేందుకు ఉపయోగించే ఫోన్, ఇప్పుడు వినోదాలు అందించే స్థాయికి చేరుకుంది. ఒక ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే, అన్ని సెల్ ఫోన్స్ ఉండాల్సిందే. లేకుంటే.. అదొక విచిత్రమే.

ఫోన్ లేకుండా చిన్న పిల్లలు కూడా ఒక్క క్షణం ఉండే కాలానికి వచ్చేశాం. మొబైల్ ఫోన్స్ లేని ఇల్లు మనం ఎంత చూడాలనుకున్నా, ఆ కోరిక నెరవేరదు. ఎంతైనా ఆధునిక యుగం కదా.. ఆ మాత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిందే. గతంలో కేవలం ఫోన్ల వరకే సెల్ ఫోన్స్ పరిమితం. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచమే చుట్టేయచ్చు. సెల్ ఫోన్స్ తో ఎంత మంచి ఉందో, అంతకు మించిన చెడు ఉందని అంటుంటారు పెద్దలు. ఫోన్స్ అధిక వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఓ వైపు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే సెల్ ఫోన్స్ అధిక వినియోగంతో రేడియేషన్ సమస్య కూడా పొంచి ఉందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

ఇది ఇలా ఉంచితే తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా జనాభా సంఖ్యకు కాస్త దగ్గరలో సెల్ ఫోన్స్ సంఖ్య ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం జనాభా సంఖ్యకు మించిన సెల్ ఫోన్స్ ఉన్నాయని తెలంగాణ బడ్జెట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. జాతీయ కమిషన్ టెక్నికల్ గ్రూప్ నివేదిక ప్రకారం, జూలై 1, 2025 నాటికి రాష్ట్ర జనాభా 3.85 కోట్లుగా అంచనా వేశారు.

Hydra Update: హైడ్రా కీలక ప్రకటన.. వాటిని కూల్చేస్తాం అంటూ వార్నింగ్..

దీనిని బట్టి ఈ సంఖ్యకు దగ్గరలో సెల్ ఫోన్స్ సంఖ్య ఉండవచ్చు. కానీ ఇక్కడ 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ ఫోన్లు ఉన్నాయట. ఇక వాహనాల విషయానికి వస్తే 1.71 కోట్లు ఉన్నాయని లెక్క. ఉండే జనాభా కంటే సెల్ ఫోన్స్ సంఖ్య అధికంగా ఉండడంతో వారెవ్వా సెల్ ఫోన్స్.. మాకంటే మీదే కౌంట్ ఎక్కువ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో సెల్ ఫోన్లకు జేజేలు పలుకుతున్నారు.

ఎంతైనా సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చిన మనల్ని ఫోన్స్ కౌంట్ లో క్రాస్ చేయడం విశేషమే. కానీ మనకు ఇంకా అక్కడక్కడా ఎక్కడో ఒక చోట నేటికీ ఫోన్ గురించి తెలియని వారు కనిపిస్తుంటారు. జరభద్రం మిత్రమా.. సెల్ ఫోన్ ను మంచికే ఉపయోగించండి.. సెల్ ఫోన్ ను వినియోగిస్తూ మీ ఆరోగ్యాన్ని మరచిపోవద్దు అంటున్నారు కొందరు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం