apple ( Image Source: Twitter)
Viral

Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికీ ఇవి సూపర్ ఫుడ్..

Weight Loss: బరువు తగ్గాలని ఆలోచిస్తున్నవారు సాధారణంగా మొదట వ్యాయామంపై దృష్టి పెడతారు. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి శారీరక శ్రమలు చేయడం వల్ల బరువు తగ్గడంలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. అయితే, బరువు తగ్గడానికి వ్యాయామం ఒక్కటే సరిపోతుందా? అసలే కాదని నిపుణులు చెబుతున్నారు.

డైటీషియన్ల ప్రకారం, ఎంత వ్యాయామం చేసినా ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తారు. కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉన్నవి ఎంచుకోవాలి, ఎందుకంటే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే, పండ్ల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఏ పండ్లు బరువు తగ్గడానికి తోడ్పడతాయి. అయితే, ఏవి తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

1. ఆపిల్

ఆపిల్ “ఒక ఆపిల్ రోజూ తింటే డాక్టర్ అవసరం ఉండదు” అనే సామెతకు తగ్గట్టుగా పోషకాల సమృద్ధిగా ఉంటుంది. ఆపిల్‌లో ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది, దీనివల్ల అనవసరమైన ఆకలి, జంక్ ఫుడ్ లేదా స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఆపిల్‌ను నేరుగా తినవచ్చు లేదా ఓట్‌మీల్, యోగర్ట్‌తో కలిపి తీసుకోవచ్చు. ఏ విధంగా తిన్నా, ఆపిల్‌లోని ఫైబర్, నీరు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

2. బొప్పాయి

బొప్పాయి పండ్లలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ముక్కలు తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి ఇబ్బందులతో బాధపడేవారికి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం అల్పాహారంలో బొప్పాయి ముక్కలు తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండటమే కాకుండా, విటమిన్ ఎ వంటి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గడంలో గణనీయంగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

3. పియర్స్

కూడా బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇవి ఫైబర్‌తో సమృద్ధిగా ఉండి, కేలరీలు తక్కువగా ఉంటాయి. పియర్స్‌ను నట్స్‌తో కలిపి తీసుకుంటే పోషకాలు సమతుల్యంగా లభిస్తాయి. అయితే, చాలామంది పండ్లను జ్యూస్‌గా చేసి, అందులో చక్కెర లేదా స్వీట్‌నర్స్ కలుపుతారు, ఇది పండ్ల సహజ గుణాలను తగ్గిస్తుంది. పండ్లను నేరుగా తినడం ద్వారా వాటిలోని పోషకాలను పూర్తిగా పొందవచ్చు. పియర్స్‌ను యోగర్ట్, నట్స్ లేదా గుడ్డు వంటి ప్రొటీన్ ఆహారాలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా, ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది