hadi rani ( Image Source: Twitter )
Viral

Hadi Rani: పెళ్ళైన మొదటి రాత్రే తన తలను నరుక్కొని భర్తకు కానుకగా ఇచ్చిన భార్య?

Hadi Rani: పెళ్ళైన మెదటి రాత్రే తన తలను నరుక్కుని భర్తకు కానుకగా ఇచ్చింది. మీరు చదువుతున్నది నిజమే. ఏంటి ఇలా కూడా ఉంటారా? అని ఆలోచిస్తున్నారా ? అసలు ఆమె ఎందుకు అలా చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..

రతన్ సింగ్ కు, హడి రాణి కి వివాహం జరిగింది. అది వాళ్ళ మొదటి రాత్రి. రాజ వ్యవహహారాలన్నీ పక్కన పెట్టేసి, ఆమెతో సంతోషంతో గడపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతలో తను కూడా ఊహించలేని విధంగా ఒక వర్త మానం అందింది. ఔరంగజేబుకు ఆడ వాళ్ళంటే పిచ్చి. తన కన్ను రాణి ప్రభావతి మీద పడింది. తనను ఎలా అయినా దక్కించుకోవాలనుకుంటాడు. దీని కోసం అతను రాజు రాజ్యం పై దాడి చేయడానికి కూడా వెనుకాడడు. రాణి ప్రభావతి రక్షణ కోసం మన రాజ్యాన్ని ఆశ్రయించింది. తనకి ఔరంగజేబు నుంచి రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చాను. ఈ రోజు నీ మొదటి రాత్రి అని తెలుసు. మోఘల్ సైన్యం మన రాజ్యాన్ని ముట్టడిస్తున్నారు. వాళ్ళతో పోరాడేందుకు నీ సహాయం కావాలని వర్తమానంలో ఉంటుంది.

రతన్ సింగ్, రాణిని వదిలి యుద్ధానికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. రాణి రోజులో ధైర్యాన్ని నింపి యుద్ధానికి సిద్దం చేస్తుంది. నాకు నీ గుర్తుగా ఏదైనా ఇవ్వు.. అది నాతో ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందని ప్రేమగా అడుగుతాడు. ఇక బయటకొచ్చి రాణి ఇలా ఆలోచిస్తుంది, ఏకాగ్రత లేకపోతే ప్రజలు రాజును తిట్టుకుంటారు, అలా జరగకూడదని తను వేరే గదిలోకి వెళ్ళి తన తలను నరుక్కుని భటుడు చేత రాజు దగ్గరికి పంపిస్తుంది. అది చూసి రాజు చాలా భయపడిపోతాడు. రాణి త్యాగాన్ని అర్థం చేసుకుని ఆమె తలను మెడలో మాల లాగా వేసుకుని, యుద్దానికి వెళ్ళి మొఘల్ సైన్యాన్ని ఒంటి చేత్తో ఓడిస్తాడు. తన రాణి పక్కన లేదని బాధతో మోకాళ్ళ మీద కూర్చొని ప్రాణాలు తీసుకుంటాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగిందని చెబుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!