RITES Recruitment: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లిమిటెడ్, భారత రైల్వేల కింది సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ రంగాల్లో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు గొప్ప అవకాశం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు rites.com అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 14, 2025 నుంచి మొదలయ్యి, నవంబర్ 12, 2025 వరకు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో అర్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
అర్హత
ఈ పోస్టులకు డిప్లొమా లేదా బి.ఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు.
సివిల్ ఇంజనీరింగ్: డిప్లొమా చేసిన వాళ్ళు అర్జులు
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: డిప్లొమా చేసిన వాళ్ళు అర్జులు
ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రో ల్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్: డిప్లొమా చేసిన వాళ్ళు అర్జులు
మెకానికల్ / ప్రొడక్షన్ / ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ / మాన్యుఫ్యాక్చరింగ్ / మెకానికల్ & ఆటోమొబైల్: డిప్లొమా చేసిన వాళ్ళు అర్జులు
మెటలర్జీ ఇంజనీరింగ్: డిప్లొమా చేసిన వాళ్ళు అర్జులు
కెమికల్ / పెట్రోకెమికల్ / కెమికల్ టెక్నాలజీ / పెట్రోకెమికల్ టెక్నాలజీ / ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ / ఫుడ్ / టెక్స్‌టైల్ / లెదర్ టెక్నాలజీ: బి.ఎస్సీ చేసిన వాళ్ళు అర్హులు
వయోపరిమితి
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు కలిగిన వారు అర్హులు
ప్రభుత్వ నియమాల ప్రకారం SC/ST/OBC/PwD/ఇతర వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది (ఉదా: SC/STకు 5 సంవత్సరాలు, OBCకు 3 సంవత్సరాలు మొదలైనవి).
జీతం
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇస్తారు. (కాంట్రాక్ట్ బేసిస్‌పై):మూల వేతనం (రూ. 100/-తో సహా): రూ.16,338 వరకు ఉంటుంది.
నెలవారీ స్థూల CTC (రూ. 100/-తో): రూ. 29,735 వరకు ఉంటుంది.
వార్షిక CTC (సుమారుగా): రూ.3,56,819 వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించాలి (GST సహా): జనరల్ / OBC: రూ.300 చెల్లించాలి.
EWS / SC / ST / PwD: రూ.100 చెల్లించాలి.
పేమెంట్ మోడ్: డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ రుసుము రిఫండ్ అవ్వదు.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14-10-2025
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 12-11-2025
రాత పరీక్ష తేదీ: 23-11-2025 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది.
వివరాలు
రాత పరీక్ష (100% వెయిటేజ్) అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న తేదీ, సమయం, వేదికకు హాజరు కావాలి
పరీక్ష వ్యవధి: 2.5 గంటలు.
ప్రశ్నలు: 125 ఆబ్జెక్టివ్ టైప్ (ప్రతి ప్రశ్నకు 1 మార్క్).
నెగటివ్ మార్కింగ్: లేదు (తప్పు సమాధానాలకు మార్కులు తగ్గవు).
కనీస మార్కులు: UR/EWSకు 50%; SC/ST/OBC(NCL)/PwDకు రిజర్వ్డ్ పోస్టులకు వ్యతిరేకంగా 50%.
PwD అభ్యర్థులకు: 50 నిమిషాల అదనపు సమయం.
సబ్జెక్టులు: జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఇంజనీరింగ్ డిసిప్లిన్ సంబంధిత
