Police Constable Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాజస్థాన్ పోలీస్ 10,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక రాజస్థాన్ పోలీస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 25-05-2025.
మొత్తం 10,000 కానిస్టేబుల్ పోస్టులకు ధరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 28-04-2025న ప్రారంభమయ్య 25-05-2025న ముగుస్తుంది. అభ్యర్థి రాజస్థాన్ పోలీస్ వెబ్‌సైట్, police.rajasthan.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము
జనరల్ / BC / MBC (CL) / ఇతర రాష్ట్రాలకు: రూ. 600/-
EWS / MBC / BC (NCL), SC / ST / TSP / Sahariya కోసం: రూ. 400/-
లోపాల సవరణ ఛార్జీలు: రూ. 300/-
ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
రాజస్థాన్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
సంక్షిప్త నోటిఫికేషన్ తేదీ: 07-02-025
పూర్తి నోటిఫికేషన్ తేదీ: 09-04-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 28-04-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 25-05-2025
రాజస్థాన్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 23 సంవత్సరాలు
డ్రైవర్ కోసం: పురుషులు: 02/01/1999 నుండి 01/01/2008 వరకు, మహిళలు: 02/01/1994 నుండి 01/01/2008 వరకు
ఇతరులకు: పురుషులు: 02/01/2002 నుండి 01/01/2008 వరకు, మహిళలు: 02/01/1997 వరకు 01/01/2008
నిబంధనల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
శారీరక ప్రమాణాల పరీక్ష (PST)
పురుషులు – ఎత్తు: 168 సెం.మీ, ఛాతీ: 81-86 సెం.మీ, బరువు: N/A
మహిళలు – ఎత్తు: 152 సెం.మీ, ఛాతీ: N/A, బరువు: 47.5 KG
శారీరక సామర్థ్య పరీక్ష (PET)
పురుషులు – 25 నిమిషాల్లో 05 కి.మీ రన్నింగ్ చేయాలి.
మహిళలు – 35 నిమిషాల్లో 05 కి.మీ రన్నింగ్ చేయాలి.
మాజీ సైనికులు – 30 నిమిషాల్లో 05 కి.మీ రన్నింగ్ చేయాలి.
TSP ప్రాంతంలోని సహారియా / SC / ST – 30 నిమిషాల్లో 05 కి.మీ రన్నింగ్ చేయాలి.