PMAY Gramin: పీఎంఏవై గ్రామీణ స్కీమ్..
PMAY Gramin ( Image Source: Twitter)
Viral News

PMAY Gramin: పీఎంఏవై గ్రామీణ స్కీమ్.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా.. వెంటనే చెక్ చేసుకోండి!

PMAY Gramin: దేశంలోని నిరుపేదలకు పక్కా ఇల్లు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 1న ప్రధాన్ మంత్రి అవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకం ప్రధానంగా ఇల్లు లేని కుటుంబాలు, పాడుబడిన లేదా తాత్కాలిక గుడిసెల్లో నివసించే కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టిపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గృహాల కొరతను తగ్గించడంతో పాటు ‘హౌసింగ్ ఫర్ ఆల్’ లక్ష్యానికి పెద్ద సహకారం అందుతోంది. PMAY-G కింద నిర్మించే ప్రతి ఇంటి కనీస పరిమాణం 25 చదరపు మీటర్లు కాగా, అందులో వంట చేయడానికి ప్రత్యేక ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. 2022 సెప్టెంబర్ 27 నాటికి 2.72 కోట్ల లక్ష్యంలోని 2 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

లబ్ధిదారులను SECC డేటా ఆధారంగా గుర్తించి గ్రామ సభల్లో పరిశీలిస్తారు. ఆమోదం లభించిన తరువాత గృహ నిర్మాణానికి సంబంధించిన మొత్తం నేరుగా లబ్ధిదారుని బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌లో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం మరికొన్ని 5 సంవత్సరాలకు, అంటే 2029 వరకు పొడిగించింది.

Also Read: Ayodhya: 100 టన్నుల పూలతో ముస్తాబైన అయోధ్య.. మంగళవారం రామ మందిరంలో జెండా ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

PMAY-G లబ్ధిదారుల స్థితి చెక్ చేసుకునే విధానం

PMAY-G అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

‘Stakeholders’ సెక్షన్‌లోకి వెళ్లి ‘IAY/PMAYG Beneficiary’ లేదా ‘Search Beneficiary’ ఎంపికను క్లిక్ చేయండి

మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేయండి

ఆ తర్వాత ‘Submit’ క్లిక్ చేస్తే మీ లబ్ధిదారుల స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది

Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రభుత్వం ప్లాన్.. ఆ గుర్తుతో 90 శాతం గెలిచేందుకు సిద్దం..!

UMANG యాప్ ద్వారా PMAY-U ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసే విధానం:

ముందుగా UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి

యాప్ ఓపెన్ చేసి ‘Pradhan Mantri Awas Yojana’ అని సెర్చ్ చేయండి

‘Installment Details’ ఎంపికను సెలెక్ట్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి

వెంటనే మీ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ స్క్రీన్‌పై చూపిస్తుంది

Just In

01

Hyderabad Police: పోలీసులకు మిస్టరీగా ఎస్ఐ కేసు.. పిస్టల్‌ను పోగొట్టుకున్న భానుప్రకాశ్!

Ponguleti Srinivasa Reddy: హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్షణ‌కు ప‌టిష్ట చ‌ర్యలు తీసుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Telangana Jagruti: కవిత మీద అవాకులు పేలితే ఊరుకోబోం.. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్!

Kodanda Reddy: కేంద్ర విత్తన చట్టం ముసాయిదా లో సవరణలు చేయాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!