Viral video
Viral

Viral Video: తమిళనాడులో ‘పరుగు’ మూవీ సీన్ రిపీట్.. వీడియో వైరల్

Viral Video: తండ్రికూతుళ్ల అనుబంధం(Father and Daughter Bond) ఎటువంటిదో వేరే చెప్పనవసరం లేదు. దానిని వెలకట్టలేం. ఒకరకంగా తండ్రి కొడుకుల బంధం కంటే బలమైనది, విలువైనది అనే చెప్పాలి. నాన్నకు కూతురు ఎప్పుడూ ప్రత్యేకమే. పైకి ఎంతో కఠినంగా కనిపించే తండ్రులు కూడా ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపే వేళ.. అప్పగింతల్లో వెక్కి వెక్కి ఏడ్వటం గమనిస్తూనే ఉంటాం. తన పలుకుబడితో పెద్దరికంతో ఊరినే హడలెత్తించే వ్యక్తి కూడా కూతురు దగ్గర మాత్రం పాదక్రాంతమవుతాడు. కూతురు చెప్పిన మాట వింటాడు. ఆమె ఎదురురానిదే బయటికెళ్లాడు. ఇలాంటి అవకాశం అబ్బాయిలకు ఉంటుందా?

ఆడపిల్ల మనసుకు దగ్గరైనంతగా మగ పిల్లాడు కూడా కాలేడు. ఇది ప్రతి తండ్రి అనుభవించే వాస్తవం. ఎందుకంటే కుమారులైన కఠినంగా ఉంటారు గానీ కూతుళ్లు మాత్రం సున్నితంగా ఉంటారన్నది లోకోక్తి. ముఖ్యంగా తండ్రి బాగోగులు, యోగ క్షేమాలను కనిపెట్టుకొని ఉండటంలో కొడుకులైనా నిర్లక్ష్యం వహిస్తారేమో గానీ కూతుళ్లు మాత్రం అలా ఉండరని, ఆ విషయంలో అవసరమైతే కన్న తల్లితో కూడా గొడవపడతారని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అందుకే సంతానంలో ఒక్క ఆడపిల్లైనా ఉండాలని తల్లిదండ్రలు కోరుకుంటుంటారు.

Police Officer Dies: పోలీస్ ఆఫీసర్ ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు..

నాన్న కూతుళ్ల ఎమోషన్ కు ఉండే స్వీట్ నెసే వేరు. సంప్రదాయ కుటుంబాల్లో కూతుర్లు పరువు, బరువు అని ఫీల్ అవుతుంటారు.. అదే సమయంలో ఆమెనే తల్లి, దైవంలా భావిస్తారు కూడా. సమాజంలో కొడుకుల కోసం కోట్లు సంపాదించిన నాన్నలే కాదు.. కూతురి కోసం సిగరెట్, మందు మానేసిన తండ్రులు కూడా ఉంటారు. కొడుకును ఎమన్నా అన్నా కొంతమంది తండ్రులు ఊరుకుంటారేమో కానీ కూతురు జోలికి వస్తే మాత్రం సహించరు.

గుండెలు పిండే ఘటన

అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. కూతురు తనకిష్టమైన వాడితో వెళ్లిపోతూ ఉండగా, తండ్రి బతిమాలుతుంటాడు. అతనితో వెళ్లొద్దని కూతురు చెయ్యి పట్టుకొని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కూతురు మాత్రం వినకుండా అతనితో వెళ్లిపోతుంటుంది. నడి రోడ్డు మీద నలుగురు చూస్తుండగానే ఇది జరుగుతుంది. తండ్రి ఆల్ మోస్ట కూతురు కాళ్లు మొక్కినంత పని చేశాడు. ఆ తండ్రి ఆవేదన చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కపోకుండా ఉండదు. కన్నీళ్లు రాకుండా ఉండవు. ఒక రకంగా పరుగు(Parugu Movie) సినిమాలో ప్రకాశ్ రాజ్(Prakash Raj) చేసిన ఓ సీన్ రిపీట్ అయిందా అన్నట్లు అనిపిస్తుంది.

హృదయాన్ని కలిచివేసే విధంగా ఉన్న ఈ వీడియో బాగా వైరల్ అయింది. అందరూ వీడియోను చూసి ఎమెషనల్ గా ఫీలై కామెంట్స్ చేస్తున్నారు. అయితే అది నిజ జీవితం కాదని, అదో షార్ట్ ఫిల్మ్ అని తాజాగా తెలియడంతో ‘‘హబ్బా.. ఎంత పని చేశార్రా. నిజమనుకొని ఎంత బాధపడ్డాం’’అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయ్యేందుకు షార్ట్ ఫిలిం కావొచ్చు కానీ అందులో కనిపించిన దృశ్యం మాత్రం హృదయాలను తాకింది. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని తండ్రి ప్రేమ ఆ చిన్న సన్నివేశంలో కనిపించింది. అందుకే అంత భావోద్వేగానికి గురవుతున్నారు.  నిజం కాదని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాంటి సన్నివేశం నిజ జీవితంలో ఏ తండ్రికి ఎదురుకాకూడదని కోరుకుంటున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం