Puzzle: మన చిన్నప్పటి నుంచి పజిల్ గేమ్స్ చూస్తున్నాం. ఎందుకంటే, ఇది మన తెలివితేటలకు పదును పెడుతుంది. ఇక ఇటీవలే ఆన్లైన్లో ‘హిడెన్ వర్డ్ ఛాలెంజ్’ బాగా వైరల్ అవుతోంది. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. మీ ఐక్యూ, దృష్టి, ఫోకస్ వంటి సామర్థ్యాలను కూడా బయటపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సెకన్లలో దాగి ఉన్న పదాన్ని గుర్తించగలిగితే, అది మీలో ఉన్న తెలివితేటలను, మైండ్ ఫోకస్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది.
ఛాలెంజ్‌కు సిద్ధమేనా?
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఎన్ని Y లు ఉన్నాయో కనిపెట్టండి. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించి దాగిన పదాన్ని కనిపెట్టడం ఈ టెస్ట్ లక్ష్యం. ఇది మీ ఫోకస్, ఓపిక, గమనించే శక్తిని అంచనా వేసే మంచి పజిల్. మీరు వెంటనే కనిపెట్టినా, కొంత సమయం పట్టినా ఏం కాదు. స్పష్టంగా కనిపించని విషయాలను కూడా గమనించేలా మెదడుకు ఈ తరహా ఛాలెంజ్‌లు ఉపయోగపడతాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా, మీరు కూడా ప్రయత్నించి మీ విజువల్ స్కిల్‌కు చిన్న టెస్ట్ పెట్టుకోండి.
Also Read: Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..
అతి తక్కువ సమయంలో కనిపెట్టగలిగితే…
మీ కళ్లూ మెదడూ బాగా కలసి పనిచేస్తున్నాయన్న మాట. ఇతరులు కనిపెట్టలేని చిన్న చిన్నవి కూడా మీరు వెంటనే గుర్తించగలుగుతారు. ఏదైనా మార్పు, తేడా (డిఫరెన్స్) ఉంటే అది క్షణాల్లో పట్టేస్తారు. ఈ టాలెంట్ వల్ల మీరు సమస్యలను క్రియేటివ్‌గా ఆలోచించి సులభంగా సొల్యూషన్ కనుగొనగలుగుతారు.
30 సెకన్ల తర్వాత కనిపెట్టగలిగితే…
ఏ పని అయినా తొందరపడకుండా, ఒక్కో విషయం బాగా గమనించి, అర్ధం చేసుకుని ముందుకు వెళ్లే స్వభావం మీలో ఉందని ఈ టెస్ట్ చెబుతోంది. ఇది మీ ఓర్పు, ఫోకస్, మైండ్ స్టబిలిటీ ఉన్నట్టు సూచిస్తుంది.
కొంచెం టైం ఎక్కువ తీసుకుని గుర్తిస్తే..
దాగి ఉన్న పదాన్ని కనిపెట్టడానికి కొంచెం టైం ఎక్కువ పట్టినా , మీరు ఓపిగ్గా, మధ్యలో మానేయకుండా ప్రయత్నిస్తారన్న మాట. ఒకసారి మొదలుపెట్టిన పని పూర్తి అయ్యే వరకు పట్టువదలకుండా చేస్తారన్న దానికి ఇది ప్రూఫ్. ఏ గోల్ అయినా అచీవ్ చేయడానికి మీరు కష్టపడతారని ఇది చెబుతోంది.

