Viral Video: ర్యాపిడో డ్రైవర్ గా మారిన ఐటీ ఉద్యోగి..
rapido ( Image Source: Twitter)
Viral News

Viral Video: ర్యాపిడో డ్రైవర్ గా మారిన ఐటీ ఉద్యోగి.. ‘ఏఐ వల్ల ఇంకెన్ని దారుణాలు చూడాలో’ అంటున్న నెటిజన్లు!

Viral Video: సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. టెక్ రంగంలో ఉద్యోగాల కొరతపై పెద్ద చర్చను రేకెత్తించింది. వీడియోలో ఒక వ్యక్తి తన స్నేహితుడు, ఐటీ ఇంజనీర్, రెండు నెలలుగా నిరుద్యోగంగా ఉన్నాడని, తన హోం లోన్ EMIలు చెల్లించడానికి ర్యాపిడో రైడర్ గా పని చేస్తున్నాడని చెప్పారు.

ఈ వీడియోని ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. Greater Noida, Gaur Cityలో పరిస్థితి ఇలా ఉందని వీడియోలో ఆయన వివరించారు, ఉద్యోగం వదిలి మంచి అవకాశం కోసం ప్రయత్నించిన తర్వాత, పరిస్థితి మరింత కష్టంగా మారిందని. అక్కడ అపార్ట్మెంట్ల ధరలు సుమారు రూ.1 కోటి–2 కోట్లు, అద్దెలు రూ.30,000–35,000 వరకు ఉంటాయని చెబుతున్నారు.

Also Read: Ayodhya: 100 టన్నుల పూలతో ముస్తాబైన అయోధ్య.. మంగళవారం రామ మందిరంలో జెండా ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

ఈ ఇంజనీర్ మొదట తన కుటుంబంతో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. కానీ, ఉద్యోగం లేకపోవడంతో తన ఫ్లాట్ అద్దెకి ఇచ్చి, రెంటు ఇల్లుకి మార్చుకోవాల్సి వచ్చింది. EMIలు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో, ఆయన ఇప్పుడు Rapido రైడ్స్ , కొన్ని ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు తో జీవనం కొనసాగిస్తున్నారు.

Also Read: Warangal District: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అత్యుత్సాహం.. రేషన్ కార్డులపై ఫొటోలు కలకలం

సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్ ఇదే!

వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ రేకెత్తింది, ముఖ్యంగా AI వాడకం, ఉద్యోగాల కొరత వంటి సమస్యలను మరోసారి గుర్తు చేసింది. “ఇది కేవలం మొదటి దశే… ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, భవిష్యత్తులో మరింత మంది కోల్పోతారు.” మరొకరు “భారతదేశంలో పరిస్థితి మరింత కష్టం అవుతుంది.. ఎవరికైనా అవకాశం ఉంటే విదేశాల్లోకి వెళ్ళండి, మంచి ప్లాన్ ఉంటే మాత్రమే ఇక్కడ ఉండండి ”. “ AI వాడకంతో పరిస్థితి మరింత దారుణమవుతుంర్యాపిడో రైడర్ గా పని చేస్తున్నాడని చెప్పారుది.” ఇంకొకరు “ఇప్పటికే హౌసింగ్ లోన్ ఉన్నవారు, ఇప్పుడు ఉన్నంతకు అమ్మి, డబ్బు పెట్టుకోండి, అలాగే, లోన్ పూర్తిచేసి ఒత్తిడి నుంచి తప్పించుకోండి.” అని నెటిజన్లు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనతో టెక్ ఉద్యోగులు, EMIలు, AI ప్రభావాలు, హౌసింగ్ లోన్స్ వంటి సమస్యలపై కొత్త చర్చను సృష్టించింది.

Also Read: Jangaon RTA Office: జనగాం రవాణా శాఖ కార్యాలయంలో జోరుగా దందా.. అన్నీ ఉన్నా చెయ్యి తడపాల్సిందే!

Just In

01

Hyderabad Police: పోలీసులకు మిస్టరీగా ఎస్ఐ కేసు.. పిస్టల్‌ను పోగొట్టుకున్న భానుప్రకాశ్!

Ponguleti Srinivasa Reddy: హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్షణ‌కు ప‌టిష్ట చ‌ర్యలు తీసుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

Telangana Jagruti: కవిత మీద అవాకులు పేలితే ఊరుకోబోం.. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్!

Kodanda Reddy: కేంద్ర విత్తన చట్టం ముసాయిదా లో సవరణలు చేయాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!