CPR To Monkey
Viral, తెలంగాణ

Viral News: కోతికి సీపీఆర్.. ఈ కుర్రాళ్లను మెచ్చుకోవాల్సిందే గురూ!

Viral News: కోతుల మధ్య గొడవలు అనేవి సర్వ సాధారణమే. అవి వాటి సామాజిక నిర్మాణంలో, ముఖ్యంగా ఆహారం, ప్రాంతం, సంపర్కం వంటి విషయాల కోసం తరచుగా కలహించుకుంటూ ఉంటాయి. ఒక కోతి, మరొక కోతిని కొట్టడం, కరవడం, లేదా పరుగెత్తించడం వంటివి చేస్తుంటాయి. సాధారణంగా, బలమైన కోతులు లేదా సమూహంలోని నాయకత్వ స్థానంలో ఉన్న కోతులు ఇతరులను బెదిరించడానికి లేదా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇలా చేస్తాయి. ఈ ఘర్షణలు కొన్నిసార్లు తీవ్రంగా మారి, గాయాలకు కూడా దారితీయవచ్చు. ఈ క్రమంలోనే పెద్దగా అరవడం, హెచ్చరించడానికి లేదా భయపెట్టడానికి గట్టిగా అరుస్తుంటాయి. కోపం లేదా దాడి చేయాలనే సంకేతంగా పళ్ళను చూపిస్తూ హడావుడి చేస్తుంటాయి. అంతేకాదు.. తానే హీరో అని చెప్పుకోవడానికి శరీరాన్ని పెద్దదిగా చేసి చూపించుకోవడం, వెన్నును వంచడం, వెంట్రుకలను నిక్కబొడుచుకోవడం వంటివి చేస్తాయి. ఇక కోపం వస్తే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదుగా.. చిన్న రాళ్ళు లేదా కొమ్మలను విసిరి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తాయి. ఇలా రెండు కోతుల మధ్య జరిగిన గొడవలో ఒక కోతికి కరెంట్ షాక్‌కు గురైంది.

Read Also- Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!

మానవత్వం చాటిన కుర్రాళ్లు..
పూర్తి వివరాల్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వింత సంఘటన జరిగింది. రెండు కోతుల గ్రూపులో జరిగిన దాడితో ఒక కోతిపిల్ల భయపడి ప్రాణాలు కాపాడుకోవడానికి కరెంటు స్తంభం ఎక్కింది. అయితే అదే స్తంభం డేంజర్ అన్న విషయం తెలియలేదు. ఒక్కసారిగా ఆ కోతిపిల్ల కరెంట్ షాక్‌కు పైనుంచి కిందపడి విలవిల్లాడింది. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కోతిని చూసిన కొందరు యువకులు చలించిపోయారు. వెంటనే శ్రీకాంత్, వేంపల్లి కృష్ణ అనే ఇద్దరు యువకులు రంగంలోకి దిగి.. కోతి పిల్లకు సీపీఆర్ (CPR) చేశారు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు సీపీఆర్ చేసి కోతి ప్రాణాలను కాపాడారు. ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్న ఆ కోతి కాసిన్ని నీళ్లు తాగి.. అక్కడ్నుంచి పరుగులు పెట్టింది. కోతి ప్రాణాలను కాపాడిన తీరు ప్రజలను ఆలోచింపజేసింది. ఎందుకంటే మనుషులు పక్కనే ప్రమాదం జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో కోతి పిల్ల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, సీపీఆర్ చేయడం అంటే మామూలు విషయమేమీ కాదు. కోతి ప్రాణాలను కాపాడిన శ్రీకాంత్, కృష్ణను ప్రజలు అభినందించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా యువకులను శభాష్ అని మెచ్చుకుంటున్నారు. మానవత్వం చాటుకున్న యువకులను భళా కుర్రాళ్లు అంటూ అభినందిస్తున్నారు. కాగా, గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు చేసే అత్యవసర ప్రక్రియే సీపీఆర్ (కార్డియోపల్మనరీ రెససిటేషన్).

Read Also- YS Jagan: సీఎం చంద్రబాబును న‌డి రోడ్డుపై కొడ‌తారా?

ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు..
ఈ మధ్య కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అందులో ఒకట్రెండు సంఘటనలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీసు అధికారి కోతికి సీపీఆర్ చేసిన ప్రాణాలు కాపాడిన సంఘటన కూడా ఉన్నది. ఈ మధ్యనే తీవ్రమైన వేడిమి కారణంగా అస్వస్థతకు గురై, అపస్మారక స్థితిలో పడివున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అతను సుమారు 45 నిమిషాల పాటు ఛాతీని నొక్కుతూ, కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ కోతిని బతికించారు. కుక్కల దాడిలో గాయపడి చలనం లేని స్థితిలో ఉన్న కోతికి తమిళనాడుకు చెందిన ప్రభు అనే వ్యక్తి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ మూడు ఘటనలు కోతులకు కూడా సీపీఆర్ అనేది ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియజేస్తున్నాయి. కోతులు శరీర నిర్మాణపరంగా మనుషులకు దగ్గరగా ఉండటం వల్ల, సీపీఆర్ పద్ధతులు కొంతవరకు పనిచేసే అవకాశం ఉంది. అయితే, వృత్తిపరమైన వైద్య సహాయం అందే వరకు ఇది ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కోతులకు సీపీఆర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అవి ఆందోళన చెందినా, కోపంగా ఉంటే వెంటనే లేచి దాడి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీలైనంత త్వరగా వైద్యుని సహాయం తీసుకోవడం ముఖ్యం.

Read Also- Jagan Vs Lokesh: వైఎస్ జగన్ రె‘ఢీ’నా.. 10 నిమిషాలు చాలు.. మంత్రి విచిత్ర ఛాలెంజ్!

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు