Viral News: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం సామాన్యుల కాళ్లు, వేళ్లు పట్టుకునే రాజకీయ నాయకులు.. ఒక్కసారి ప్రతినిధిగా గెలిచారంటే భూమ్మీద ఆగరు. సామాన్యులను అస్సలు లెక్కచేయరు, పట్టించుకోరు. సర్వం తానే అన్నట్టుగా వ్యవహరిస్తారు. అవసరమైతే సామాన్యులపై దాడులకు తెగబడతారు. ఇలాంటి ఘటనే ఒకటి ఢిల్లీ-భోపాల్ వందే భారత్ రైలులో చోటుచేసుకుంది. సీటు మార్చుకునేందుకు నిరాకరించాడనే కారణంతో ఓ సామాన్య ప్యాసింజర్‌పై ఒక ఎమ్మెల్యే దాష్టీకానికి (Viral News) పాల్పడ్డారు. అన్యాయంగా చితకబాది, రైలు లోనుంచి తోసిపడేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే రాజీవ్ సింగ్, తన భార్య, కొడుకుతో కలిసి గత గురువారం తన నియోజకవర్గానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కుటుంబానికి రైలు కంపార్ట్‌మెంట్ వెనుక భాగంలో సీట్లు వచ్చాయి. అయితే, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ముందు భాగంలో కూర్చోవాలని ప్రయత్నించారు. ఇందుకోసం సీటు మారాలంటూ ముందు భాగంలో కూర్చున్న ప్యాసింజర్‌కు చెప్పారు. అందుకు ఆయన నిరాకరించారు.
Read this- Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?
సీటు మారడానికి నిరాకరించిన వ్యక్తి పక్క ప్యాసింజర్లను బతిమాలి ఆ సీట్లలో కూర్చున్నారు. అయితే, రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకోగానే ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులు రైలు ఎక్కారు. భోపాల్‌కు వెళుతున్న సదరు ప్రయాణికుడిపై దాడికి తెగబడ్డారు. దాదాపు ఆరు నుంచి ఏడుగురు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముఖంపై బలంగా కొట్టడంతో పాటు చెప్పులు కూడా ఉపయోగించారు. దీంతో, బాధిత ప్యాసింజర్ ముక్క నుంచి రక్తం కారింది. రక్తంతో అతడి చొక్కా తడిచిపోయింది.
ట్రైన్లో బీజేపీ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితకబాదిన అనుచరులు
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్లో తనకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు#BJP #TrainIncident pic.twitter.com/QBo8VOeqmL
— Swetcha Daily News (@SwetchaNews) June 23, 2025
సీట్లు మార్చుకునే విషయంలో ఘర్షణ జరిగిందని రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఝాన్సీ) విపుల్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించామని, ప్రభుత్వ రైల్వే పోలీసులు నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) నమోదు చేశారని వివరించారు. తన భార్య, కొడుకుతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో తోటి ప్రయాణికుడు (ఎమ్మెల్యే) అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీటు మార్చుకునేందుకు నిరాకరించడంతో తన కుటుంబం పట్ల దురుసుగా ప్రవర్తించాడని, ఆ తర్వాత ఝాన్సీ స్టేషన్‌లో కొంతమంది వ్యక్తులకు ఫోన్ చేసి పిలిపించాడని పేర్కొన్నాడు. రైలు కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని వివరించాడు.
Read this- Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్