Health Tips: నిమ్మ కాయ మనకీ అన్నీ విధాలుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, జుట్టు సమస్యల నివారణకు, ఇంకా దుష్టశక్తులను తరిమేయడానికి కూడా నిమ్మకాయ ఒక అద్భుతమైన ఔషధమనే చెప్పుకోవాలి. ఈ పండు మన జీవనశైలిలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఆరోగ్యానికి నిమ్మకాయ ఔషధం
ఉదయం లేచిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీర్ణ రసాలను ఉత్తేజపరిచి, జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి నిమ్మరసం ఒక అద్భుతమైన చిట్కా. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటారు. ఇది మానసిక ఒత్తిడి కూడా తగ్గిస్తుంది.
సౌందర్యం
నిమ్మకాయ చర్మ సౌందర్యానికి ఒక వరం. దీని రసాన్ని చర్మానికి రాస్తే చర్మం మృదువుగా, మెరిసేలా మారుతుంది. జుట్టు సమస్యలైన చుండ్రు, జుట్టు రాలడం వంటివి నివారించడంలో నిమ్మరసం పనిచేస్తుంది. నిమ్మరసాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు మొత్తం పోతుంది. షాంపూలు, సబ్బుల తయారీలో కూడా నిమ్మకాయను ఉపయోగిస్తారు, ఇది చర్మానికి సహజమైన సౌందర్యాన్ని, జుట్టుకు బలాన్ని ఇస్తుంది.
రుచిలోనూ నిమ్మకాయ అద్భుతం
నిమ్మకాయ రుచికి పుల్లగా ఉంటుంది. దీంతో పులిహోర, సలాడ్‌లు, పచ్చళ్లు కూడా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ లేకుండా ఈ వంటకాలు అసంపూర్ణంగా అనిపిస్తాయి. నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పాత కాలంలో నిమ్మకాయ పచ్చళ్లు ఇంటింటా చేసుకుని తినే వాళ్ళు, కానీ ఈ రోజుల్లో వీటి వాడకం తగ్గినా, దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు అలాగే ఉన్నాయి.
