Aghori Srinivas: లేడీ అఘోరీ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొద్దీ నెలల క్రితం ఎంత ఫేమస్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. లేడీ అఘోరీ శ్రీనివాస్ అని పిలవబడే అలియాస్ అల్లూరి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ క్రియోట్ చేశాడు. సనాతన ధర్మం అని పేరు చెప్పి చేయకూడని పనులు చేసి, దేవాలయాల వద్ద రచ్చ చేసి, వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే అతడు ఒకసారి జైలుకి వెళ్లి వచ్చాడు.
Also Read: Konda Surekha: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ.. అందుకేనా..
కొత్త లుక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అఘోరి!
అయితే, తాజాగా పాత లుక్‌కు గుడ్‌బై చెప్పి కొత్త గెటప్‌లో అఘోరి మెరిసిపోతున్నాడు. సాధారణంగా భయానక లుక్‌తో కనిపించే శ్రీనివాస్ ఈసారి పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది. కొత్త లుక్‌లో ఆయన మరింత స్టైలిష్, స్మార్ట్‌గా కనిపిస్తూ అభిమానులను షాక్ కి గురి చేశాడు. అతన్ని చూసి చాలామంది కామెంట్స్‌లో “ఏమి ట్రాన్స్‌ఫార్మేషన్ రా బాబోయ్!”, “అఘోరీ నుంచి హీరోయిన్ లుక్‌కు మారిపోయాడు!” అంటూ రియాక్ట్ అవుతున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన వీడియోలో శ్రీనివాస్ స్మార్ట్ అవతారంతో ఆకట్టుకున్నారు. నల్ల చీర , కొప్పులో పూలు, మెడలో రుద్రాక్షలు వేసుకుని ఆయన కొత్తగా మెరిసిపోతున్నారు. ఈ లుక్ వెనుక ఇంకో కొత్త స్కెచ్ ఏమైనా ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త లుక్‌కు నెటిజెన్స్ ఫిదా!
సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయన ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతుండగా, నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “ మీరు మారిపోయారు సార్.. మొత్తం లుక్ మార్చేశారు”. “ ఇదే అవతారంతో మిమ్మల్ని సినిమాల్లో కూడా చూడాలని ఉంది.” “ఇలాగే సర్ప్రైజ్‌లు ఇస్తూ ఉండండి సార్!” అంటూ కొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
