FM symbol in Railway
Viral

FM symbol in Railway: రైల్వే ట్రాక్‌ పక్కనే ఉండే ‘ఎఫ్ఎం’ గుర్తు గురించి తెలుసా?

FM symbol in Railway: భారత దేశంలో అత్యధిక మంది ప్రయాణించేది రైలులోనే. అందుకే దాన్ని సామాన్యుడి వాహనం అంటారు. నిత్యం లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే, రైల్వే స్టేషన్‌ (Railway Station) కు వెళ్లింది మొదలు, దిగే వరకు రైలుపైనా, దారి మధ్యలో మనకు అనేక గుర్తులు, అక్షరాలు కనిపిస్తాయి. వాటికి ఉండే అర్థాలు కొంతమందికే తెలుసు. వాటిలో ఒకటే ఎఫ్ఎం (FM). దీని గురించి చాలామందికి తెలియదు.

Read Also- Man Hulchul Hyderabad: పోలీస్ బాస్ ఫోన్ నెంబర్ తో వ్యక్తి హల్చల్.. కేసు నమోదు!

ఈ గుర్తుకు అర్థం ఏంటి?

రైలు ప్రయాణం చేసేటప్పుడు ట్రాక్‌ పక్కనే తెల్లటి రాయిపై ఎఫ్ఎం అని అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఇది రెండు ట్రాకుల మధ్యలో ఉంటుంది. అది చూసిన వారికి దీని అర్థం ఏమై ఉంటుందో అనే సందేహం వచ్చి ఉండొచ్చు. ఎంఎఫ్ అంటే ‘ఫౌలింగ్ మార్క్’ (Fouling Mark) అని అర్థం. రైల్వేలో లేదా రవాణా వ్యవస్థలో ఎఫ్ఎం అనేది ఇండికేటర్. సాధారణంగా ట్రాక్ లేదా రోడ్డు చివరి పాయింట్‌కు సూచిక. ట్రాక్ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్‌కు రైలు మారే సమయంలో ఇది కనిపిస్తుంది. ఎఫ్‌ఎం కనిపిస్తే అనుమతి లేకుండా ఆ మార్గంలో రైలు ముందుకు వెళ్లడం సురక్షితం కాదని అర్థం. ఈ మార్క్‌ను దాటి ముందుకెళ్తే ప్రమాదం పొంచి ఉంటుందని, రైలును ఢీకొట్టే ప్రమాదం ఉందని ఈ మార్క్ అప్రమత్తం చేస్తుంది.

Read Also- India Vs Pakistan: సరిహద్దులో పాకిస్థాన్ బరితెగింపు

రైళ్ల క్రాసింగ్‌ సమయంలో కీలకం

రైల్వే వ్యవస్థలో భద్రత, సమర్థవంతమైన రైళ్ల నిర్వహణలో ఈ ఇండికేటర్‌ చాలా ముఖ్యం. ట్రాక్‌లపై రైళ్లు ఢీకొనకుండా, ప్రయాణంలో అవరోధాలను నివారించడంలో ఇది చాలా కీలకమైనది. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ రైల్వే ట్రాక్‌లు ఉన్నప్పుడు, సురక్షితంగా రైళ్ల క్రాసింగ్‌ కోసం, ఒకదాన్ని దాటి మరొకటి ముందుకు వెళ్లాల్సిన సందర్భాల్లో ఈ సూచిక చాలా ఉపయోగపడుతుంది. ప్రమాదాలను నివారించడానికి రైళ్లు సురక్షితమైన దూరాన్ని పాటించడానికి ఎఫ్ఎం ఇండికేటర్‌ను ఉపయోగిస్తారు. రైల్వే ట్రాక్‌లపై రైలు వెనుక భాగం దాన్ని దాటి వెళ్లకూడదని సూచించడానికి ట్రాక్‌ పక్కన ఫౌలింగ్ గుర్తును పెయింట్ చేస్తారు. ఎందుకంటే ఇది పక్కనే ఉన్న ట్రాక్‌పై సమీపించే రైలుకు ప్రమాదాన్ని కలిగిస్తుంది.

Read Also- YS Sharmila On Modi: మోదీజీ ఈసారైనా పూర్తి చేస్తారా? రాజధాని పై షర్మిల కీలక వ్యాఖ్యలు..

రవాణా వ్యవస్థలో అదే ముఖ్యం

రవాణా మార్గం ఏదైనా ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే అన్నింటికంటే ముఖ్యమైనది. అందుకే, ప్రభుత్వాలు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటుంటాయి. అందులో భాగంగానే రైల్వేలు, రోడ్లపై ఇలాంటి ముఖ్యమైన గుర్తుల విధానాలను సంబంధిత వ్యవస్థలు ఉపయోగిస్తుంటాయి. ఇలాంటి వాటిపై అవగాహనతో ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.

Read Also- Maoists: నక్సల్స్‌తో శాంతి చర్చలు.. 2004లో ఏం జరిగింది? ఈసారి ఏం చేయాలి?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్