Kishan Reddy
Viral, లేటెస్ట్ న్యూస్

Kishan Reddy: కేంద్రం నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: 20 కోట్ల మంది పేదిరికం నుంచి బయటపడ్డారు

11 ఏండ్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఇది సాధ్యం
ఆదాయ పన్ను మినహాయింపు కారణంగా డబ్బు మిగులు
జీఎస్టీ స్లాబ్‌లను తగ్గించబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కేంద్ర ప్రభుత్వం గత 11 ఏండ్లలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల ఫలితంగా.. దేశంలో 20 కోట్ల మంది అత్యంత పేదరికం స్థాయి నుంచి విముక్తి పొందారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. మాదాపూర్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో -2025కి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 11 ఏండ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీలు, విధానాల కారణంగా మధ్యతరగతితో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు జరిగిందన్నారు. పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్, పీఎం ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ కార్యక్రమాల ప్రభావం ద్వారా స్పష్టమైన ఫలితాలను కనబడుతున్నాయని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఇలాంటి పథకాల కారణంగానే పేదలు తమ ఆర్థిక స్తోమతను మెరుగుపరచుకుంటున్నారని, సొంతింటి కల కూడా నెరవేర్చుకుంటున్నారని అన్నారు.

రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు కారణంగా.. మధ్యతరగతి చేతుల్లో కొంత డబ్బు మిగులుతోందని, ఇది వారి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు పెట్టుబడిగా దోహదపడుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ శ్లాబ్స్‌ను తగ్గించబోతున్నట్లు ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయంతో వస్తువులు, సేవలపై పన్నులు మరింత తగ్గుతాయని, డబ్బు మరింత ఆదా అవుతుందని చెప్పారు. క్రెడాయ్ కార్యక్రమానికి ఎంచుకున్న థీమ్ ‘చాయిస్ ఈజ్ యువర్స్’ అని, ఇది వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు రియల్ ఎస్టేట్ రంగం పనిచేస్తున్న తీరును ప్రతిబింబిస్తుందని కొనియాడారు.

Read also- Warangal: వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి కీలక ఆదేశాలు

ఆర్ఎస్ ప్రవీణ్‌కు కుక్క కరిచిందా?: మాజీ ఎంపీ వెంకటేష్ నేత
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి కుక్క కరిచినట్టు, అజ్ఞాని మాదిరిగా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ వెంకటేష్ నేత విమర్శలు గుప్పించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఇలా మాట్లాడటం చూస్తుంటే తనకు జాలి కలుగుతోందని ఎద్దేవా చేశారు. దొరల గడీలో వారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కట్టుకథ అల్లారంటూ ధ్వజమెత్తారు.

Read Also- Rajiv Yuva Vikasam: నిరుద్యోగ యువతకు ‘రాజీవ్ యువవికాసం’ అమలు అప్పుడేనా!

కూలిన ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రులపై మాట్లాడతావా అంటూ వెంకటేశ్ నేత ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులలో ప్రవీణ్ చేసిన అవినీతి బయటికి వస్తుందనే భయంతో పిచ్చి కుక్క కరిచినట్టుగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. కాళేశ్వరం కట్టు కథను ప్రాజెక్ట్ ఉన్న మహదేవపూర్ నుంచి మొదలెట్టి ఉక్రెయిన్ వరకు తీసుకెళ్లాడని చురకలంటించారు. కట్టు కథలు అల్లడంలో హాలీవుడ్ డైరెక్టర్స్‌ను ప్రవీణ్ కుమార్ మించిపోయారంటూ సెటైర్లు వేశారు. హాలీవుడ్ డైరెక్టర్‌గా ట్రై చేయాలంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు బాంబు భాస్కర్ అవార్డు రావడం ఖాయని ఎద్దేవా చేశారు. ప్రవీణ్ కుమార్ పాకిస్థాన్ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని వెంకటేశ్ నేత ధ్వజమెత్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రవీణ్‌కు గుండుపై వెంట్రుకలే లేవనుకున్నానని, లోపల మైండ్ అయినా ఉందా? లేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవసరమని దుయ్యబట్టారు. వారి హయంలోనే ప్రాజెక్ట్ కూలిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కూలడంపై వారికి అనుమానం ఉన్నప్పుడు సీబీఐ విచారణను ఎందుకు కోరలేదని వెంకటేశ్ నేత ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో జరిగింది ఎలుక అవినీతి కాదని, అనకొండ, ఎలుగుబంటి , ఏనుగు అవినీతి అంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతితో బుర్జ్ ఖలీఫాలో ప్లాట్స్ కొన్నారని ఆయన ఆరోపించారు. గురుకులాల్లో చేసిన అవినీతితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుర్జ్ ఖలీఫాలో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు