IPPB Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 348 పోస్టుల్లో అభ్యర్థులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌లో పనిచేస్తున్న GDSలకు ఇది గొప్ప అవకాశం. గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు, ఆకర్షణీయ జీతంతో బ్యాంకింగ్ రంగంలో జాయిన్ అయి మీ కలను నిజం చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు 09-10-2025 నుంచి ప్రారంభమయ్యి 29-10-2025 వరకు ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాల కోసం ఈ www.ippbonline.com వెబ్‌సైట్‌లోకి తెలుసుకోండి.
అర్హతలు
విద్యార్హత: భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం/సంస్థ/బోర్డు నుంచి ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్ (రెగ్యులర్ లేదా దూరవిద్య). ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఆమోదించిన కోర్సులు కూడా చెల్లుబాటవుతాయి.
అనుభవం: కనీస అనుభవం అవసరం లేదు.. గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేయవచ్చు!
వయోపరిమితి (01-08-2025 నాటికి): కనీసం 20 సంవత్సరాలు, గరిష్టం 35 సంవత్సరాలు. SC/ST/OBC/ఇతర రిజర్వేషన్‌ల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
జీతం
IPPBలో GDS ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే వారికి:
బేసిక్ పే: నెలకు రూ. 30,000/- వరకు చెల్లిస్తారు.
ట్యాక్స్: IT చట్టం ప్రకారం పన్ను మినహాయింపులు అప్లై అవుతాయి.
ఇన్సెంటివ్స్: పనితీరు ఆధారంగా వ్యాపార సముపార్జన/అమ్మకాలపై బోనస్ & వార్షిక పెంపు
గమనిక: ఇవి తప్ప మరే వేతనం, బోనస్‌లు ఇవ్వబడవు. కానీ ఈ ప్యాకేజీతో గ్రామీణ బ్యాంకింగ్‌లో స్థిరమైన కెరీర్ గ్యారెంటీ.
దరఖాస్తు రుసుము
ఫీజు: రూ. 750/- (నాన్-రిఫండబుల్). దరఖాస్తు చేసే ముందు మీ అర్హతను చెక్ చేయండి.
విధానం: ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి రాదు. దరఖాస్తును విత్‌డ్రా చేయడం కూడా అనుమతించరు.
ఎంపిక ప్రక్రియ
మెరిట్ ఆధారంగా, సింపుల్!ప్రధానంగా గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్.
అవసరమైతే ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించవచ్చు.
ఫైనల్ సెలక్షన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిష్ అవుతాయి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం – 09-10-2025
దరఖాస్తు చివరి తేదీ – 29-10-2025
దరఖాస్తు సవరణలు చివరి తేదీ – 29-10-2025
