railway jobs ( Image Source: Twitter)
Viral

RRB: రైల్వేలో ఉద్యోగాల జాతర.. 8,875 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RRB: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. యువతకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) NTPC కింద 8,875 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో 5,817 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు, 3,058 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పోస్టుల్లో గూడ్స్ గార్డ్ (3,423), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ (921), స్టేషన్ మాస్టర్ (615) ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్ (2,424), అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (394), జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (163), ట్రైన్స్ క్లర్క్ (77) ఖాళీలు ఉన్నాయి.

MMTSలో అవకాశాలు

MMTS రైల్వేలలో గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల్లో సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్ (638), చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్ (161), ట్రాఫిక్ అసిస్టెంట్ (59) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇడబ్ల్యుఎస్ వర్గాలకు రిజర్వేషన్ నియమాలను కచ్చితంగా అమలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది.దరఖాస్తు విధానం అధికారిక వెబ్‌సైట్ www.rrbcdg.gov.in కి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే?

1. ముందుగా ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేయండి.
2. వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఖాళీలను ఎంచుకోండి.
3. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
4. ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్ సబ్మిట్ చేయండి.
5. ఫారమ్ కాపీ సేవ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
3. దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 10, 2025 వరకు.

దరఖాస్తు రుసుము

జనరల్, OBC, EWS: రూ. 500 ను చెల్లించాలి.
SC, ST, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు: రూ. 250 ను చెల్లించాలి

పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది

CBT-1 (స్క్రీనింగ్ టెస్ట్) ప్రశ్నలు: 100
జనరల్ అవేర్‌నెస్: 40
మ్యాథమెటిక్స్: 30
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30
వ్యవధి: 90 నిమిషాలు
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు.

CBT-2 (పోస్ట్-స్పెసిఫిక్ టెస్ట్) ప్రశ్నలు: 120
జనరల్ అవేర్‌నెస్: 50
మ్యాథమెటిక్స్: 35
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 35
వ్యవధి: 90 నిమిషాలు
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు.

ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోండి.

Just In

01

Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి.. ఆశావాహుల్లో మెుదలైన టెన్షన్!

Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!

The Raja Saab Trailer: ప్రభాస్ భయపెట్టడానికి వచ్చేశాడు రోయ్.. చూసేద్ధాం రండీ..

Jogulamba Temple: జోగులాంబ సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి