Job-Resign
Viral, లేటెస్ట్ న్యూస్

Techie Resign: ఏడాదికి రూ.12 లక్షల వేతనం.. జాబ్‌లో చేరిన 9 రోజులకే రిజైన్.. ఎందుకో తెలుసా?

Techie Resign: కష్టకాలంలో ఉన్నప్పుడు దొరికిన ఉద్యోగాన్ని ఎవరూ అంత సాధారణంగా వదులుకోరు. కానీ, భారత్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ దాదాపు నాలుగు నెలల అన్వేషణ తర్వాత దొరికిన ఉద్యోగాన్ని పట్టుమని పది రోజులు కూడా చేయకుండానే రిజైన్ (Techie Resign) చేసేశాడు. 9 రోజులు చేసి రిజైన్ లేటర్ ఇచ్చాడు. రూ.14 లక్షల వార్షిక ప్యాకేజీతో ‘రిమోట్ డెవ్‌ఆప్స్’ అనే ఒక చిన్న స్టార్టప్‌లో అతడు ఉద్యోగం చేశాడు. అయితే, డెవ్‌ఆప్స్‌లో చేరినప్పటికీ, ఇదే సమయంలో ఓ మల్టీనేషనల్ కార్పొరేషన్‌లో (ఎంఎన్సీ) ఉద్యోగానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించింది. రూ.15 లక్షల వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే, డెవ్‌ఆప్స్‌కు రిజైన్ చేసి, అంతర్జాతీయ కంపెనీలో చేరడం కరెక్టేనా? అంటూ రెడిట్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఏమంటున్నాడంటే?

‘‘ఫ్రెండ్స్, కొన్నిసార్లు జీవితం వింతగా అనిపిస్తుంది. నాలుగు నెలల పాటు ఖాళీగా ఉన్నాను. జాబ్ కోసం ప్రతిచోటా అప్లై చేశాను. ఒకదాని తర్వాత మరొకటి అన్ని రిజెక్ట్ అయ్యాయి. చివరకు ఓ చిన్న స్టార్టప్‌ డెవ్‌ఆప్స్‌ ఉద్యోగ అవకాశం ఇచ్చింది. అందులో దాదాపు 80 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 10 మంది మాత్రమే భారతీయులు ఉన్నారు. లైఫ్‌లో కొంత స్థిరత్వం వస్తుందనే ఉద్దేశంతో జాబ్‌లో చేరాను. కానీ, ఇదే సమయంలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ప్రాసెస్‌లో ఉన్నాను. డెవ్‌ఆప్స్‌లో జాయిన్ అయిన కొన్ని రోజులకే మల్టీనేషనల్ కంపెనీ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ ఆఫర్ వచ్చింది. ఒక లక్ష రూపాయల జీతం ఎక్కువగా ఆఫర్ చేశారు. జీతం విషయంలో పెద్ద వ్యత్యాసమేమీ లేదు. కానీ, పెద్ద కంపెనీలో కొంత స్థిరత్వం, బ్రాండ్ వ్యాల్యూ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ చేరాలని నిర్ణయించుకున్నాను’’ అని సదరు వ్యక్తి వివరించాడు.

ఆకర్షించిన కారణాలు ఇవే

మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ కావడానికి ఆకర్షించిన అంశాలను రెడిట్ యూజర్ వెల్లడించాడు. ‘‘మల్టీనేషనల్ కంపెనీలు నమ్మదగినవి, స్థిరత్వం కూడా ఉంటుంది. బ్రాండ్ వ్యాల్యూ కారణంగా అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే పేరు కూడా వచ్చింది. మునుపు డెవలపర్‌గా ఉన్నారు. వర్క్-లైఫ్ బాలన్స్ కూడా బాగుంటుంది. బెంగళూరులో (ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌హోం) పనిచేయాలి. హైబ్రిడ్ రోల్, వారం‌లో 2 రోజులు ఆఫీసుకి వెళ్లాల్సి ఉంటుంది’’ అని వివరించాడు.

Read Also- R Narayana Murthy: చిరంజీవి చెప్పిందంతా నిజమే.. బాలయ్య కాంట్రవర్సీపై పీపుల్ స్టార్ స్పందనిదే!

అయితే, స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయిన 9 రోజులకే రిజైన్ చేయడంపై ఆలోచిస్తున్నానని తెలిపాడు. తాను చాలా కష్టపడి, చాలా ఇంటర్వ్యూల తర్వాత వచ్చిన జాబ్ అదని, జాబ్ లేని సమయంలో చాలా కష్టపడ్డానని చెప్పాడు. అందుకే, పున:పరిశీలన చేయాలని భావిస్తున్నానని, రెడిట్‌లో పోస్ట్ పెట్టడానికి కారణం ఇదేనని చెప్పాడు. కొత్త జాబ్ దీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నానని, ఈ జాబ్ మార్పుల ఒత్తిడి నుంచి బయట పడాలని ఉందన్నారు. జాబుల కోసం దరఖాస్తులు అప్లై చేయడం మానేశానని, నిజంగా అలసిపోయానని, ఇక ప్రశాంతత కావాలని చెప్పాడు. కొత్త ఉద్యోగం కనీసం 1.5 నుంచి 2 ఏళ్లపాటు కొనసాగాలనిపిస్తోందని అన్నాడు.

Read Also- Women Safety: మహిళల భద్రత కోసం పటిష్ట వ్యూహం.. బస్సులో పొరపాటున ఈ తప్పులు చేయకండి!

ఎక్కువగా ఆలోచించకు…

ఈ పోస్టు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. మల్టీనేషనల్ కంపెనీలో జాబ్‌ను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే, అలాంటి కంపెనీల్లో స్థిరత్వంతో పాటు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు తీసుకొస్తుందని సూచించారు. ఒక యూజర్ స్పందిస్తూ, ఎంఎన్ఎసీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. బ్రాండ్ గుర్తింపు కూడా సహాయపడుతుంది. కాబట్టి, ఎక్కువగా ఆలోచించకు. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు అంటూ సమర్థించాడు. మరొకరు స్పందిస్తూ, ‘‘అన్నా, నేను కూడా ఇదే పరిస్థితిలో ఒక్క రోజులోనే రిజైన్ చేశాను. తర్వాత నా ప్రయాణం ఊహించని విధంగా మంచిగా మారిపోయింది. అపరాధ భావన వొద్దు. ముందుకెళ్లిపో!’’ అంటూ సూచన చేశాడు.

Just In

01

KTR: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana Assembly: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై.. విచారణ షెడ్యూల్ విడుదల

JubileeHills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నోడల్ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు

Hyderabad Floods: ఉగ్రరూపం దాల్చిన మూసీ నది.. జలదిగ్భందంలో బస్తీలు

Asia Cup 2025 Final: ఇది జరిగితే చాలు.. ఫైనల్ మ్యాచ్‌పై పాకిస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు