Smart Phones
Viral, లేటెస్ట్ న్యూస్

Smart Phones: చైనాను దాటేసిన భారత్.. మనమే టాప్!

Smart Phones: భారత్‌ అరుదైన ఘనత సాధించింది. అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కువగా సేల్ అవుతున్న మొబైల్స్ తయారు చేస్తున్న (Smart Phones) దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2025 రెండో త్రైమాసికం (Q2) నాటికి అమెరికాలో విక్రయమవుతున్న స్మార్ట్‌ఫోన్లకు తయారీ కేంద్రంగా భారత్ నిలిచిందని, అగ్రస్థానాన్ని దక్కించుకుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘కెనలిస్‌’ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య అస్థిరతల నేపథ్యంలో, చైనా సప్లయ్ దెబ్బతినడం ఒక కారణమని పేర్కొంది. అమెరికా విక్రయదారులు ‘చైనా ప్లస్ వన్’ విధానాన్ని (చైనాతో పాటు ఇతర దేశాలపై ఆధారపడడం) అనుసరిస్తున్నాయి. ఇదే సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద దేశీయంగా తయారీకి కేంద్రం పెద్దపీట వేస్తుండడం భారత్‌కు కలిసి వచ్చాయి.

కెనలిస్ రిపోర్ట్ ప్రకారం, 2025 రెండో త్రైమాసిక నాటికి భారతదేశంలో తయారైన స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి పరిమాణం 2024 రెండో త్రైమాసికంతో పోల్చితే 240 శాతం మేర పెరిగింది. దీంతో, అమెరికాలో సేల్ అవుతున్న స్మార్ట్ ఫోన్లలో భారత్‌లో తయారైన ఫోన్ల వాటా 13 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది. ఈ భారీ పెరుగుదలతో భారత్ మొట్టమొదటిసారి అమెరికా మొబైల్స్ మార్కెట్‌లో చైనాను దాటి అగ్రస్థానంలో నిలిచింది. టాప్ మొబైల్ తయారీ కేంద్రంగా ఎదిగింది. భారత తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహక చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. దేశీయంగా ఫోన్ల అమరిక, తయారీ కేంద్రాలు దోహదపడ్డాయి. 2024 రెండో త్రైమాసికంలో అమెరికాలో సేల్ అయిన స్మార్ట్‌ఫోన్లలో చైనా వాటా 61 శాతం ఉంది. అయితే, 2025 రెండో త్రైమాసికానికి ఇది 25 శాతానికి పడిపోయింది. అంటే, సగానికి పైగా పతనమైంది. ఈ తగ్గుదలలో పెద్ద భాగాన్ని భారత్ ఆక్రమించుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also- Health: ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకొని తింటున్నారా?.. శరీరంలో ఏం జరుగుతుందంటే?

‘చైనా ప్లస్ వన్’ విధానం సానుకూలం
అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చైనా-అమెరికా మధ్య పన్నుల వివాదాలు, వాణిజ్య అనిశ్చితి పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో, ఫోన్ల తయారీ కంపెనీలు ‘చైనా ప్లస్ వన్’ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. అంటే, చైనాతో పాటు ఇతర దేశాలను కూడా తయారీ కేంద్రాలుగా ఎంచుకోవడం దీనివెనుక ఉద్దేశం. ఈ పరిణామంతో భారత్‌కు ప్రాధాన్యత పెరిగింది.

ఆపిల్ భాగస్వామ్యం కీలకం
అమెరికాలో భారత మొబైల్ ఫోన్లకు మార్కెట్ పెరగడంలో యాపిల్ (Apple Phones) పాత్ర ఎంతో కీలకంగా మారింది. యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ప్రో మోడళ్ల తయారీని చైనా నుంచి భారత్‌కి తరలించింది. ఈ దిశగా గత కొన్నేళ్లుగా భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతోంది. ఈ ఉత్పత్తులలో ఎక్కువ భాగం అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేస్తోంది. ఈ పరిణామం భారత మొబైల్ ఫోన్ విక్రయాలకు దోహదపడుతోంది. అయితే, ఐఫోన్ ప్రో మోడళ్లకు కావాల్సిన పెద్ద స్థాయి సరఫరా కోసం ఆపిల్ ఇప్పటికీ చైనాపైనే ఆధారపడుతోంది. కెనలిస్ రిపోర్ట్ ప్రకారం.. 2025 రెండో త్రైమాసికం నాటికి యూఎస్‌కు ఐఫోన్ వేరియంట్ల సప్లయ్ ఏడాది ప్రతిపాదికన 11 శాతం తగ్గి 13.3 మిలియన్ యూనిట్లకు పెరిగింది.

Read Also- Viral News: రెస్టారెంట్‌లో నీతా, ఇషా అంబానీలు.. వీడియో వైరల్

యాపిల్‌తో పాటు సామ్‌సంగ్‌, మోటరోలా వంటి దిగ్గజ బ్రాండ్లు కూడా భారత్‌లో సెల్‌ఫోన్ తయారీని పెంచుతున్నాయి. అమెరికాలో అమ్ముడవుతున్న తమ స్మార్ట్‌ఫోన్లను ఈ సంస్థలు భారత్‌లో అసెంబుల్‌ చేయడం మొదలుపెట్టాయి. 2025 రెండో త్రైమాసికం నాటికి అమెరికాకు చెనా ఎగుమతులు కిందటేడాదితో పోల్చితే 38 శాతం పెరిగి, 8.3 మిలియన్ యూనిట్లకు చేరాయి. మోటరోలా కంపెనీ విషయానికి వస్తే, స్వల్పంగా 2 శాతం మేర వృద్ధి చెంది 3.2 మిలియన్ యూనిట్లకు పెరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారత్ తర్వాత వియత్నాం అత్యధికంగా అమెరికా మార్కెట్‌కు మొబైల్ ఫోన్లను సరఫరా చేస్తోంది. అమెరికా మార్కెట్‌లో భారత్ వాటా 44 శాతంగా ఉండగా, వియత్నాం వాటా 30 శాతంగా ఉంది. చైనా వాటా 61 శాతం నుంచి 25 శాతానికి పడిపోయింది.

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!