Anshul Kamboj
Viral, లేటెస్ట్ న్యూస్

Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. సీఎస్కే ప్లేయర్‌కు సెలక్టర్ల పిలుపు

Team India: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్‌ల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. ఈ నెల 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా (Team India) గట్టి పట్టుదలతో ఉంది. అయితే, మ్యాచ్‌ ప్రారంభానికి మూడు రోజుల ముందు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటే నాలుగో టెస్టులో ఆడతాడని భావించిన పేసర్ అర్ష్‌దీప్ గాయపడ్డాడు.

అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేసే ఎడమ చేతికి నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రమైన గాయం అయింది. బంతి బలంగా తాకడంతో గాయమై, కుట్లు కూడా పడ్డాయి. దీంతో, నాలుగవ మ్యాచ్‌కు అర్షదీప్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అర్షదీప్ సింగ్‌కు ప్రత్యామ్నాయంగా హర్యానా, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ అంశుల్ కంబోజ్‌ను (Anshul Kamboj) సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు ప్లేయర్‌కు పిలుపునిచ్చారు.

అర్షదీప్ సింగ్ గాయపడడంతో ‘కవర్ ప్లేయర్’గా కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వర్గాలు తెలిపాయి. కాగా, కంబోజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 22 మ్యాచ్‌లు ఆడి 22.66 సగటుతో 74 వికెట్లు సాధించాడు. 410 పరుగులు కూడా సాధించాడు. 2024–25 రంజి ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే 10 వికెట్లు సాధించాడు. తొలి మ్యాచ్‌లోనే పది వికెట్లు సాధించిన మూడో ప్లేయర్‌గా అర్షదీప్ సింగ్ నిలిచాడు. ఇక, దులీప్ ట్రోఫీలో ఇండియా సీ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 16 వికెట్లు సాధించాడు. 8/69 బెస్ట్ ప్రదర్శనగా నమోదయింది.

Read Also- Health News: వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా?. కారణం ఇదే!

ఇటీవలి ఇండియా-ఏ వర్సెస్ ఇంగ్లాండ్-ఏ మధ్య జరిగిన రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో అంశుల్ కంబోజ్ చక్కటి ప్రదర్శన చేశాడు. దీంతో, సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ కొంతమేర ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మల్టీ టాలెంటెడ్ ప్లేయర్లకు జట్టులో ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో నాలుగో టెస్టుకు కంబోజ్‌కు ప్రాధాన్యత ఇస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇస్తే, అంశుల్ కంబోజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ క్రిష్ణలలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Read Also- Health News: వ్యాయామం చేసినా బరువు తగ్గట్లేదా?. కారణం ఇదే!

మరోవైపు, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా జరగబోయే నాలుగో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలా వద్దా అన్నదానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. మెరుగైన ఇతర పేసర్లు ఎవరూ కనిపించకపోవడంతో సెలక్టర్లు కంబోజ్‌వైపు చూశారు. అతడిని జట్టులోకి తీసుకోవడం కీలకమైన నిర్ణయంగా పరిగణించవచ్చని క్రికెట్ నిపుణులు అంచనా విశ్లేషిస్తున్నారు. కాగా, టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్షన్ కమిటీ ఉమ్మడి తీసుకున్న నిర్ణయం ప్రకారం, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 టెస్టుల్లో కేవలం 3 మాత్రమే ఆడాలి. వర్క్‌లోడ్ పడకుండా నియంత్రించేందుకు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మొదటి, మూడవ టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడగా మరొక్క టెస్టులో మాత్రమే ఆడతాడు. అది నాలుగో టెస్ట్ అవుతుందా, ఐదవ మ్యాచ్ అవుతుందా అనేది వేచిచూడాల్సిందే. మరోవైపు, అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. అయితే, పరిమితి ఓవర్ల క్రికెట్‌లో మంచి అనుభవం ఉంది. 8 వన్డేలు, 63 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక, 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు