Animal Vision: కళ్ళు ఉన్న వాళ్ళు అన్ని చూడగలుగుతారు. అలాగే, చూశాకా ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనకి బాగా తెలుసు. మనం ఎలా అయితే, అన్ని రంగులు చూడగలుగుతున్నామో .. జంతువులు కూడా అలాగే చూస్తాయని తెలుసా. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. జంతువులు కూడా రంగులను చూడగగలవాని కొందరు చెబుతున్నారు. మీకు ఇప్పుడు ఒక సందేహం రావొచ్చు. జంతువుల రంగులు మనకీ ఎలా కనిపిస్తాయి అని, బ్రెయిన్ స్కానింగ్ టెక్నాలజీతో జంతువులు వేరు వేరు రంగులు చూసి, అవి ఎలా రియాక్ట్ అవుతాయో.. దాని బట్టి ఈజీగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన కళ్ళకి ప్రపంచం ఎలా కనిపిస్తుందో మనకీ బాగా తెలుసు. కానీ, జంతువుల కళ్ళకి ఈ వరల్డ్ ఎలా కనబడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
జంతువుల కళ్ళకి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందంటే?
పిల్లి
పిల్లులకు మన లాగా ఎక్కువ రంగులు కనపడవు. కానీ, డార్క్ చీకటిలో మన కన్నా 6 రెట్లు ఎక్కువగా చూడగలవు.
ఈగ
ఈగకి ఈ ప్రపంచం మొత్తం స్లో మోషన్ లో కనిపిస్తుంది. ఏంటి ఇది నిజమేనా అని అనుకుంటున్నారా ? అవును మీరు వింటున్నది నిజమే. దీనిలో ఉండే ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే.. ఇవి అల్ట్రా వయొలెట్ రేస్ ను కూడా చూడగలవు.
పాము
పామును, మనుషులతో పోలిస్తే చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే, అవి థర్మల్ సిగ్నేచర్స్ కూడా సెన్స్ చేయగలవు.
పావురాలు
మనకీ సాధారణంగా పెద్ద భవనాల మీద నుంచి క్రిందికి చూసినప్పుడు వాహనాలు చిన్నగా కనిపిస్తాయి. కానీ, పావురాలకీ రోడ్డు మీద ఉండే చిన్న పగుళ్ళు కూడా కనిపిస్తాయంటే నమ్ముతారా? అవును ఇది నిజమే. అలాగే వీటికి ప్రపంచం 340 డీగ్రిస్ లో కనిపిస్తుంది.
తేనెటీగలు
తేనెటీగలకు ఎరుపు రంగు అసలు కనిపించదు. ఎందుకంటే, వాటికి రెడ్ కలర్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కాబట్టి.
