Toxic Kitchen Items
Viral, లేటెస్ట్ న్యూస్

Toxic Kitchen Items: మీ వంటగదిలోని ఈ పాత్రలు.. ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలుసా?

Toxic Kitchen Items: రోజువారి వ్యాయామంతో పాటు మన ఆహారపు అలవాట్లు సైతం ఆరోగ్యం, ఫిట్‌నెస్ స్థాయిలపై ప్రభావం చూపిస్తుంటాయి. చెడు ఆహారం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే హానికారకమైన వంటపాత్రల్లో ఆరోగ్యానికి మేలు చేసే వంట చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని  హెచ్చరిస్తున్నారు. వంటగదిలో తరుచుగా వినియోగించే 3 హానికారకమైన వస్తువుల గురించి తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ కిచెన్ వస్తువులు ఏవి? వాటి వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావం ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

1. ప్లాస్టిక్ వంటపాత్రలు
ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ వస్తువులు అన్ని ప్రాంతాలను ఆక్రమించేశాయి. ఆఖరికి వంటగదిలోకి సైతం ప్లాస్టిక్ వస్తువులు ప్రవేశించాయి. కొందరు వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్స్ లోనే తింటుకున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం. ప్లాస్టిక్ వస్తువులకు వేడి తగిలినప్పుడు అది తనలోని BPA (బిస్‌ఫీనాల్ A) వంటి హానికర రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి శరీరంలోకి వెళ్తే ఎంతో ప్రమాదకరం. కాబట్టి స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్ లేదా వెదురు వంటి సురక్షితమైన పదార్థాలతో తయారు చేసిన పాత్రలను ఎంచుకోవడం మంచిది.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాల్ హెల్త్ సైన్స్ (National Institute of Environmental Health Sciences) నివేదిక ప్రకారం.. 2003-2004లో సీడీసీ (Disease Control and Prevention) NHANES III పేరుతో సర్వే నిర్వహించింది. అందులో 6 ఏళ్లు పైబడిన 2,517 మంది మూత్ర నమూనాలను పరీక్షించగా వారిలో 93% మందిలో BPA గుర్తించబడింది.

2. ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డులు
కొందరు వంటగదిలో కూరగాయల కటింగ్స్ కోసం ప్లాస్టిక్ బోర్డులను వినియోగిస్తుంటారు. ఇవి కూడా కాలక్రమేణా క్షీణించి మైక్రోప్లాస్టిక్‌లను ఆహారంలోకి విడుదల చేస్తాయి. ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డుల స్థానంలో ఉడ్ లేదా గ్లాస్‌తో చేసిన వాటిని వినియోగించాలి.

3. గీతలు పడిన లేదా పగిలిన నాన్-స్టిక్ పాన్‌లు
దెబ్బతిన్న నాన్ స్టిక్ పాన్ లలో PFAS (పర్‌ఫ్లోరోఆల్కిల్, పాలీఫ్లోరోఆల్కిల్) పదార్థాలు ఉండే అవకాశముంది. ఇవి శరీరంలోకి చేరి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి నాన్-స్టిక్ పాన్‌లు నుంచి విడుదలయ్యే విషపూరిత కణాలను అడ్డుకునేందుకు వాటి స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్, ఐరన్ లేదా ఫుల్ సిరామిక్ పాన్‌లను ఉపయోగించడం మంచిది.

సాన్‌ఫ్రాన్సిస్కో పర్యావరణ విభాగం ప్రకారం (San Fransico Environment Department), PFAS లేదా ‘ఫరెవర్ కెమికల్స్’ను నాన్-స్టిక్ వంట పాత్రల్లో సర్వసాధారణంగా వినియోగిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికేకాకుండా పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి.

గమనిక: మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా వార్తను అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Lions In Beach: ఆడ సింహాల ఒత్తిడి.. ఫ్యామిలీతో బీచ్‌లకు వెళ్తోన్న మగ సింహాలు.. ఇదేందయ్యా ఇది!

Hyderabad Police: సిమెంట్ బస్తాల ముసుగులో.. రూ.6.25 కోట్ల గంజాయి రవాణా ఎక్కడ పట్టుకున్నారంటే?

Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ పాల‌న‌లోనే గ్రూప్ -1 నియామ‌కాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

RV Karnan: ఉద్యోగులసేవలు మరువలేనివి.. కర్ణన్ కీలక వ్యాఖ్యలు

OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా చేస్తూ పట్టుబడితే.. ఏం చేశారంటే?