Viral Video (image credit:Pixeles)
Viral

Viral Video: ఓరి.. నీ.. తెలివి తగలెయ్య.. ఇదేం టెక్నిక్ భయ్యా.. నువ్వు సూపర్..

Viral Video: భయ్యా.. నీ తెలివికి జోహార్ అనేస్తున్నారు నెటిజన్స్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కానీ, జనాలు మరీ తెలివి మితిమీరారట. ఇదేమి టాలెంట్ స్వామి, నీకు రెండు చేతులు జోడిస్తున్నాం అంటూ కామెంట్స్ మారుమ్రోగుతున్నాయి. ఇంతలా ఈ కామెంట్స్ వచ్చేంత పని అతడేమి చేశాడని మీరనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ కావాల్సిందే.

మనం ప్రస్తుతం ఆధునిక కాలంలో ఉన్నాం. ఈ కాలంలో ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాం. అలాగే అద్భుతాలను కూడా సృష్టిస్తున్నాం. అందుకే ఈ కాలాన్ని కొందరు స్పీడ్ యుగం అని కూడా అంటున్నారు. ఇలాంటి స్పీడ్ యుగంలో అన్నీ స్పీడ్ స్పీడ్ గా సాగాల్సిందే. అయితే మరీ స్పీడ్ అయితే కాస్త ఇబ్బందే అంటున్నారు మేధావులు. మొన్నటి సెల్ ఫోన్ అంటేనే తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేడు సెల్ ఫోన్ లేని గ్రామం ఎంత వెతికినా కానరాదాయే. అందుకే ఆధునిక టెక్నాలజీ అనడం కంటే, అత్యాధునిక టెక్నాలజీని మనం ఉపయోగిస్తున్నాం.

చేతిలో మొబైల్ ఉంటే చాలు, కొందరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. కేవలం ఫోన్ ద్వారా ఆదాయం పొందుతూ జీవనం సాగించే వారు ఎందరో. చేతిలో ఫోన్ ఉంటే చాలు, మనం ప్రపంచాన్ని చుట్టేసే జ్ఞానాన్ని, మార్గాన్ని అది చూపించేస్తుంది. ఇది మొన్నటి వరకు, ఇప్పుడు ఏఐ కాలం నడుస్తోంది. అంతేకాదు చాట్ జీపీటీ రావడంతో ఏదైనా క్షణాల్లో తెలిసిపోతోంది. జస్ట్ ఒక్క సమాచారం ఇవ్వమంటే, ఇంకా కావాలా బాబు అనే స్థాయికి చాట్ జీపీటీ చేరింది.

ఇటీవల చాలా వరకు విద్యార్థులు తమ ప్రశ్నలకు జవాబులు చెప్పమని ఏఐ, చాట్ జీపీటీలనే అడుగుతున్నారట. ఇటీవల ఇలాంటి పరిణామాలపై కొందరు సాంకేతిక పరిజ్ఞానం కలవారు ఇది మరీ డేంజర్ అనేస్తున్నారు. ఏదిఏమైనా ఇటీవల వీటి వినియోగం అధికమైంది. ప్రధానంగా యువకులు చాట్ జీపీటీని వినూత్న రీతిలో సైతం వినియోగిస్తున్నారు. అయితే ఓ యువకుడు చాట్ జీపీటీని వినియోగించిన తీరుకు అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడంటే.. పుచ్చకాయ కొనేందుకు చాట్‌జీపీటీని వాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చాట్‌జీపీటీ సాయంతో అతడు వివిధ రకాల పుచ్చకాయలను పరిశీలించాడు. అందులో స్వీట్, రెడ్‌గా ఉన్న పండును గుర్తించాలని ఏఐని కోరాడు. కొన్నింటిని పరిశీలించాక ఒకదానిని అది సూచించింది. కట్ చేసి చూడగా పండు ఎర్రగా ఉంది. ఇదేంది భాయ్ బిగ్ షాకిచ్చావని ఆ వ్యాపారి ఖంగుతిన్నాడు. ఇలా మంచి పుచ్చకాయను ఏఐ ద్వారా ఆ వ్యక్తి కనుగొనగా, ఓరి నీ.. తెలివి అంటే నీదే భాయ్ అనేస్తున్నారు నెటిజన్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా.. రిజల్ట్ ఎలా వస్తుందో చూడండి.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?