Man Fined (image credit:Canva)
Viral

Man Fined: రైల్వే స్టేషన్ లో ఒక్క కాల్ కు.. రూ. 18 వేల ఫైన్.. అసలేం జరిగిందంటే?

Man Fined: సాధారణంగా మనం ఫోన్ మాట్లాడే సమయంలో స్పీకర్ ఆన్ చేసి అప్పుడప్పడు మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడే సమయంలో కొందరికి ఇబ్బంది కలగడం కామన్. మనం మెట్రో రైళ్లలో ప్రయాణించే సమయంలో సౌండ్ బయటకు వినిపించే విధంగా సెల్ ఫోన్ మాట్లాడవద్దని, పాటలు అలా వినవద్దని చెబుతుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకున్నాడు.. ఏకంగా తన సోదరితో కాల్ మాట్లాడుతూ.. స్పీకర్ ఆన్ చేశాడు.. ఇక అంతే ఆ నాలుగు మాటలు మాట్లాడినందుకు ఏకంగా పెద్ద జరిమానే చెల్లించాడు. అసలేం జరిగిందంటే..

రైల్వే స్టేషన్స్ వద్ద రూల్స్ పాటించకపోతే ఎంత ప్రమాదమో తెలిపే ఘటన ఇది. ఔను.. మనం రైల్వే స్టేషన్ కు వెళ్లిన సమయంలో అక్కడి రూల్స్ పాటించాల్సిందే. లేకుంటే జరిమానా పర్వం తప్పదు. ఇటీవల ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు. రైలు వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకేముంది మనోడు ఫోన్ చేతిలో పట్టుకున్నాడు. కాసేపు పాటలు విన్నాడు. ఆ తర్వాత తన చెల్లెలుకు ఫోన్ చేశాడు. హలో.. హలో అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. సౌండ్ సక్రమంగా వినిపించక పోవడంతో ఏకంగా సెల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. అలా ఆన్ చేసి ఏకంగా మాట్లాడుతూ ఉన్నాడు. చుట్టూ ప్రయాణికులు, అతడినే చూస్తూ ఉన్నారు.

అంతలోనే రైల్వే అధికారి వచ్చి పక్కన నిలబడ్డారు. ఇంకేముంది మనోడు తెగ మాట్లాడేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉండడంతో ఆ అధికారి సైతం అలాగే సైలెంట్ గా ఉండిపోయారు. కాల్ కట్ కాగానే, రైల్వే అధికారి మీరు జరిమానా చెల్లించాలి అంటూ ఉన్నది ఉన్నట్లు తెగేసి చెప్పారు. ఇంకేముంది మనోడు షాక్ తిన్నాడు. నేనెందుకు ఫైన్ కట్టాలి అంటూ కోపం ప్రదర్శించాడు. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడినందుకు రూ. 13,863 చెల్లించాలని ఆ అధికారి చెప్పగానే, ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు. సార్.. సార్. ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు. నేను ఇప్పుడు కట్టలేను అన్నాడు.

Also Read: Swami Nithyananda: నిత్యానంద చనిపోలేదు.. కైలాస దేశం ప్రకటన

ఆ ఒక్క మాటతో.. సదరు రైల్వే అధికారి అలాగా, అయితే రూ. 18,000 చెల్లించాలని హుకుం జారీ చేశాడు. జస్ట్ ఒక్క ఫోన్ కాల్.. విలువ రూ. 18000 పలికింది. దీనిని బట్టి మనం రైల్వే రూల్స్ పాటించకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమైందిగా.. ఇంతకు ఈ ఘటన జరిగిందో ఎక్కడో తెలుసా.. ఫ్రాన్స్ లో. కేవలం రైల్వే స్టేషన్ లో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడినందుకు, రూ. 18,000 (ఇండియన్ కరెన్సీలో) చెల్లించాడు. మన రైల్వే స్టేషన్లలో కూడా ఇదే రూల్ వస్తే, ఇక ఫైన్ రూపంలోనే ఆదాయం ఇండియన్ రైల్వే కు వస్తుంది. అందుకే మన ఇండియన్ రైల్వే, మన కోసం ఎన్నో సేవలు అందిస్తోంది. ఆ సేవలు సద్వినియోగం చేసుకుందాం.. మన ఇండియన్ రైల్వే రూల్స్ తప్పక పాటిద్దాం.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?