True Hero: తండ్రి తన పిల్లలను ఎంతగా కాపాడుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొండంత కష్టం ఎదురైన బిడ్డల కోసం ధైర్యంగా ఎదుర్కొంటాడు. కుటుంబ పోషణ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటాడు. అలాంటిది తన కళ్లముందే బిడ్డకు ఆపద వస్తే ఏ తండ్రైనా చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి. అమాంతం ఆపదను వెనక్కి నెట్టేసి బిడ్డను కాపాడుకుంటాడు. సరిగ్గా ఈ తరహా ఘటనే అమెరికాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని బహమాస్ నుంచి సముద్రం మార్గాన ఫ్లోరీడాకు డిస్నీ డ్రీమ్ అనే క్రూయిజ్ షిప్.. బయలు దేరింది. నడి సముద్రంలో షిప్ ప్రయాణిస్తుండగా ఐదేళ్ల పాప ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ఇది గమనించిన తండ్రి ముందు వెనక ఆలోచించకుండా వెంటనే ఓడ నుంచి సముద్రంలోకి దూకాడు. మునిగిపోతున్న పాపను తన ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించాడు. ఇది గమనించిన షిప్ లోని ప్రయాణికులు.. వెంటనే సిబ్బందిని అలర్ట్ చేశారు. అయితే అప్పటికీ షిప్ కొంత దూరం ప్రయాణించింది. రంగంలోకి దిగిన షిప్ లోని సహాయక సిబ్బంది.. చిన్న బోటు వేసుకొని తండ్రి, కూతుర్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇద్దరినీ కాపాడి బోటులోకి ఎక్కించుకున్నారు. అయితే రెస్క్యూ టీమ్ వచ్చే వరకూ బిడ్డను మునిగిపోకుండా 20 నిమిషాల పాటు తండ్రి కాపాడినట్లు తెలుస్తోంది.
NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.
The ship was heading back to South Florida when the intense rescue was made.
“The ship was moving quickly, so quickly, it’s crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O
— Collin Rugg (@CollinRugg) June 30, 2025
Also Read: Actress Pakeezah: కన్నీళ్లు పెట్టిన పాకీజా.. స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్ స్పందన
నెటిజన్లు ప్రశంసలు..
నీటిలో ఉన్న తండ్రి కూతుర్లను రెస్క్యూ టీమ్ రక్షిస్తున్న దృశ్యాలను షిప్ లోని వ్యక్తి తన కెమెరాలో బంధించారు. అది కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. తండ్రిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కూతుర్ని కాపాడుకున్న రియల్ హీరో అంటూ ఆకాశానికెత్తుకున్నారు. ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకోవడాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే వారిద్దరి ఆదృష్టం బాగుందన్న అభిప్రాయాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే సమయంలో షార్క్ లేదా తిమింగళం వంటి ప్రమాదకర జీవులు నీటిలో ఉండి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని అభిప్రాయపడుతున్నారు.