Viral News: విషపూరితాలు, మృగాలను పట్టుకొని నియంత్రించేవారు ఎంత జాగ్రత్తగా ఉంటే (Viral News) అంతమంచిది. ముఖ్యంగా పాముల పట్టేవారైతే ఎంత అనుభవం ఉన్నా ప్రతి సందర్భంలోనూ అత్యంత అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ప్రమాదం పొంచివుంటుంది. పాములు స్వభావానికి భిన్నంగా ప్రవర్తిస్తే మాత్రం కాటు వేయడానికి అవకాశాలు ఉంటాయి. పాములు పట్టడంలో ఎంతో అనుభవం ఉన్న ఓ వ్యక్తి ఓ నల్లతాచుపామును విజయవంతంగా పట్టుకున్నాడు. కానీ, జాగ్రత్త మరచి మెడకు చుట్టుకున్నాడు. అయితే, పాము కరవడంతో ప్రాణాలు కోల్పోయాడు. పాములు పట్టే వ్యక్తులకు గుణపాఠం లాంటి ఒక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
ఆయన గతంలో వందల పాములు పట్టుకున్నాడు. స్నేక్ ఉందంటూ ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే ఇల్లు, షాప్ లేదా నివాస ప్రాంతాలు అనే తేడా లేకుండా ఎన్నో చోట్లకు వెళ్లి పట్టుకున్నాడు. కానీ, అజాగ్రత్తగా వ్యవహరించిన ఓ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని రఘోగఢ్ పట్టణానికి చెందిన కట్రా మొహల్లాకు చెందిన ‘స్నేక్ క్యాచర్’ దీపక్ మహబార్ (42 ఏళ్లు) పాముకాటుకు బలయ్యాడు. బర్బట్‌పురాలో ఒక ఇంట్లో పాము కనిపించిందంటూ సోమవారం మధ్యాహ్న సమయంలో ఫోన్ కాల్ రావడంతో వెంటనే బయలుదేరి వెళ్లాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న మహబార్, జాగ్రత్తగా పామును పట్టుకున్నాడు. పాము పట్టిన సమయానికి తన కొడుకు స్కూల్ సమయం పూర్తయిందని గ్రహించి, అతడిని తీసుకొచ్చేందుకు హుటాహుటిన బయలుదేరాడు. ఈ క్రమంలో పట్టుకున్న పామును తన మెడకు చుట్టుకుని, బైక్‌పై స్కూల్‌కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మహబార్ చేతిపై పాము కాటు వేసింది. మరుసటి రోజు ఉదయం అతడు చనిపోయాడు.
Read Also- Hair Tips: వర్షంలో జట్టు తడుస్తోందా?.. డెర్మటాలజిస్టులు ఏం చెబుతున్నారంటే?
పాము కాటు వేసిన వెంటనే దీపక్ మహబార్ తన స్నేహితుడికి ఫోన్ చేసి హాస్పిటల్‌కు వెళ్లడానికి హెల్ప్ చేయాలని కోరాడు. తొలుత రఘోగఢ్‌లోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత, మెరుగైన చికిత్స కోసం గునా జిల్లా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రానికి ఆరోగ్యం మెరుగవుతున్నట్టు కనిపించడంతో ఆయన ఇంటికి వచ్చారు. అయితే, ఆ రోజు రాత్రి పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also- Hair Tips: వర్షంలో జుట్టు తడుస్తోందా?.. డెర్మటాలజిస్టులు ఏం చెబుతున్నారంటే?
దీపక్ మహబార్.. జేపీ యూనివర్సిటీలో స్నేక్ క్యాచర్‌గా పనిచేశాడు. పాము వచ్చిందంటూ ఫోన్ కాల్స్ వస్తే వెంటనే వెళ్లి డబ్బులు తీసుకోకుండా పట్టుకునేవాడు. ఆ విధంగా వందలాది పాములను పట్టి, అటవీ ప్రాంతాల్లో వదిలి పెట్టాడు. దీంతో, జనాలకు దీపక్ మహబార్‌కు చాలా మంచి పేరు ఉంది. పాము వచ్చిందంటూ ఎప్పుడు, ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లేవాడని దీపక్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు. ఇప్పుడు కూడా పాము పట్టాడు, కానీ బైక్‌పై తిరిగి వస్తుండగా అదే పాము కాటుకు గురయ్యాడని విచారం వ్యక్తం చేశారు. పాము కరిచిన రోజు సాయంత్రం వరకు బాగానే ఉన్నాడని, కానీ, ఆ రోజు రాత్రికి మళ్లీ అస్వస్థతకు గురయ్యాడని వివరించారు. సోమవారం మధ్యాహ్నం 12 లేదా 1 గంట మధ్య పాముకాటుకు గురయ్యాడని గుర్తుచేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.