Trott on Kohli: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అతడు లండన్ లో సెటిల్ అయినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లండన్ లోని నాటింగ్ హిల్ లో కోహ్లీ నివసిస్తున్నట్లు ఒక నివేదిక సైతం పేర్కొంది. అయితే లండన్ లోని కోహ్లీ అడ్రస్ ఎక్కడో తాజాగా బయటకొచ్చింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ (Jonathan Trott).. తాజాగా స్టార్ స్పోర్ట్స్ లో మాట్లాడారు. ఇంగ్లండ్ – భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ గురించి ప్రస్తావిస్తూ.. కోహ్లీ గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. విరాట్.. లండన్ లోని సెయింట్ జాన్స్ వుడ్ లో నివసిస్తున్నట్లు అతడు తెలిపారు. ఆ ప్రాంతం ఖరీదైన ఆస్తులకు ప్రసిద్ధి చెందిందని అన్నారు. లండన్ లో అది నివాస ప్రాంతమని చెప్పుకొచ్చారు. దీంతో లండన్ లో కోహ్లీ అడ్రస్ లీక్ అయ్యిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
Also Read: Julian Ryan: రియల్ హీరో.. చనిపోతానని తెలిసినా.. ఐదుగురిని రక్షించాడు!
ఇంగ్లాండ్ వేదికగా 2025 వింబుల్డన్ హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆడుతున్న నేపథ్యంలో విరాట్ వింబుల్డన్ మ్యాచ్ కు వెళ్లాడు. డార్క్ బ్రౌన్ కలర్ సూట్లో, అనుష్క వైట్ కలర్ జాకెట్ కనిపించారు. సూట్లో కింగ్ గ్రాండ్ లుక్లో కనిపించగా, అనుష్క రెగ్యులర్ ఔట్ ఫిట్ ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విరాట్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.