Viral Video : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (Duvvada Srinivas, Divvela Madhuri) జంట గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా గురించి కాసింత అవగాహన ఉన్న జంటకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే ఏదో ఒకలా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. నలుగురిలో వీరిద్దరూ నానుతూనే ఉంటారు. లివింగ్ రిలేషన్ సాగిస్తూ సమాజంలో పూర్తిస్థాయి ఎంజాయ్ చేస్తున్న జంటల్లో ఈ జంట ఒకటి.. వెరీ స్పెషల్ కూడా. వైసీపీ (YSRCP) నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఇంటర్వ్యూలు, వ్యక్తిగత పనులు, బిజినెస్ పనుల్లో బిజిబిజీగా ఉంటున్నారు. ఈ మధ్యనే చీరల వ్యాపారంలోకి దిగిన ఈ జంట.. పూర్తిగా పాలిటిక్స్‌ను పక్కనెట్టి నిమగ్నమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దివ్వెల కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్‌లో మాధురి, శ్రీనివాస్ ఇద్దరూ హిందీ డ్యూయెట్ పాటకు స్టెప్పులు ఇరగదీశారు. ఈ డ్యాన్స్ చూసి.. ఫంక్షన్‌కు వచ్చిన శ్రీకాకుళం, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులు, రియల్టర్లు, సినీ ఆర్టిస్టులు అందరూ నోరెళ్లబెట్టేశారట. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ట్రెండింగ్‌లో ఉంది కూడా. నెటిజన్లు ఈ ఇద్దరి కెమిస్ట్రీని, ఉత్సాహాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం రాయలేని, మాట్లాడకూడని సెన్సార్ పదాలతో దుమ్ముదులిపి వదులుతున్నారు.
Read Also- Agri Gold: అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట.. వెయ్యి కోట్లు వచ్చేశాయ్!
నాన్‌స్టాప్‌గా 4:22 నిమిషాలు!
కుమార్తె ఫంక్షన్‌లో ఈ జంట హిందీ పాటకు నాన్ స్టాప్‌గా 4:22 నిమిషాల పాటు డ్యాన్స్ చేయడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి తోడు ఆ పాటకు తగ్గట్టుగానే యాక్షన్, ఆ కాస్ట్యూమ్, బ్యాగ్రౌండ్ కూడా అదిరిపోయింది. మొత్తమ్మీద ఇప్పుడున్న ఈ కుర్రాళ్లకు, కుర్ర జంటలకు తామేమీ తక్కువ కాదన్నట్లుగా పెర్ఫార్మెన్స్ ఇరదీసేశారు అంతే. ఈ వీడియోను మాధురి తన యూట్యూబ్ చానెల్ ‘మాధురి మీ తెలుగు అమ్మాయి’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయగా.. మూడ్రోజుల వ్యవధిలోనే 196K వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు.. అలాగనీ తిట్టకుండా, తిట్టుకోకుండా ఉండలేరు కూడా. అటు కామెంట్స్, ఇటు వ్యూస్‌తో యూట్యూబ్‌లో మాధురి వీడియో ట్రెండింగ్‌లో ఉన్నది. ఇక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లోనూ ఈ వీడియో పెద్ద ఎత్తునే వైరల్ అవుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కామెంట్స్, ట్రోలింగ్‌తో సోషల్ మీడియా బద్ధలయిపోతోంది. ఇక లైవ్‌లో ఈ వీడియో చూస్తున్నంత సేపు వీక్షకులు, అతిథులు.. కుర్చీల్లో కూర్చోలేకపోయారని తెలిసింది. ఈ జంట స్టెప్పులకు ఊగిపోతూ, ఈలలు, కేకలు కొడుతూ ఒకానొక దశలో స్టేజి పైకెక్కి కాళ్లు కదుపుదామా? అని అనుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారట. బహుశా ఈ జంట ఇంకాస్త డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో సూపర్ డ్యాన్స్‌లు వేసేవాళ్లు కూడా ఓడిపోతారేమో సుమీ!
కామెంట్లు చూస్తే..!
ఈ వీడియోకు కామెంట్స్ చూస్తే.. బాబోయ్ ఆ కిక్కే వేరబ్బా. ‘ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి కూటమి పరిపాలనను ఎంజాయ్ చేస్తున్న మన దువ్వాడ’ అంటూ వైసీపీ కార్యకర్తలు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. ‘ ఏ మాటకు ఆ మాట వైసీపీ ఓడిపోయిన తర్వాత.. కూటమి కంటే వీరిద్దరే బాగా ఎంజాయ్ చేస్తున్నారబ్బా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘ భరించలేను.. ఈ బరితెగించిన దువ్వాడ వారి నాట్య మంజరి’ అంటూ విమర్శకులు, ట్రోలర్స్ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు జైళ్లు, ఇంకొందరు అజ్ఞాతంలో, మరికొందరు రోగాలుతో తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉంటే.. దువ్వాడ మాత్రం హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేద్దాం రా’ అంటూ దూసుకెళ్తున్నారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరేమో.. ఓరి బాబూ ‘ వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఎంజాయ్ చేస్తున్నారు.. ఆ డబ్బు మనది కాదు.. ఎంజాయ్ చేస్తున్న వాళ్లను విడదీసే హక్కూ మనకు లేదు’ అని కొందరు ఈర్షపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ ఒక సలీం – అనార్కలి, ఒక రోమియో – జూలియట్, ఒక షాజహాన్ – ముంతాజ్, ఒక దువ్వాడ – మాధురి’ అంటూ ఈ జంటను ఆకాశానికెత్తిన జనాలూ ఉన్నారు.
Read Also- Duvvada Srinivas: వైఎస్ జగన్ వద్దు బాబోయ్.. పార్టీ మారిపోతున్న దువ్వాడ!
ఇక ఆలస్యమెందుకు.. వీడియో చూసేయండి..