Deepfake Insane: ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ (Deep Fake Tech) ఉపయోగించి రూపొందించిన ఫేక్ వీడియోలు, ఫొటోలకు ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ జాబితాలో తాజాగా న్యూజిలాండ్ (NewZealand) ఎంపీ లారా మెక్‌క్లూర్ (Laura McClure) చేరారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎంపీ లారా మెక్‌క్లూర్ ఫొటోను తీవ్ర అభ్యంతరకరమైన డీప్ ఫేక్‌గా మార్చివేశారు. ఈ విషయం ఆమె దృష్టికి వెళ్లడంతో పార్లమెంట్ సెషన్‌లో ఈ ఫొటోను ఆమె ప్రదర్శించారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం ఎంత ప్రమాదకరమైనదో ఆమె చాటిచెప్పారు. ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంట్‌లో దాదాపు 5 నిమిషాలపాటు ఆమె మాట్లాడారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి ఫొటోలు సృష్టించి ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also- RCB Stampede News: తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన
అందుకే ప్రదర్శించాను
డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు బాధితులకు ఎంత అవమానకరంగా అనిపిస్తాయో, ఆ దుష్ప్రభావం ఏవిధంగా ఉంటుందో మెక్‌క్లూర్ వివరించారు. ఆ ఫొటో ఫేక్ అని తనకు తెలిసినప్పటికీ, పార్లమెంటులో దానిని ప్రదర్శించాల్సి రావడం చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో కలిగే హానికరమైన పరిస్థితులపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ ఫొటోను తాను పార్లమెంట్‌లో ప్రదర్శించానని ఆమె వివరణ ఇచ్చారు. వ్యక్తుల అనుమతి లేకుండా ఈ తరహా అభ్యంతరకర ఫొటోలను షేర్ చేయడం చట్టవిరుద్ధమని, ఇందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న చట్టాన్ని సవరించాలని ఆమె డిమాండ్ చేశారు. డీప్‌ఫేక్ దుర్వినియోగాన్ని చట్టాల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె గొంతెత్తారు. అభ్యంతరకర ఫొటోలను షేర్ చేయడం చట్టవిరుద్ధంగా మార్చేందుకు ప్రస్తుతం ఉన్న అన్ని చట్టాలను సవరించాలని నినాదించారు.
Read Also- Pottimama: ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ పొట్టిమామ గురించి తెలుసా?
చాలా భయపడ్డాను
సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ ఫొటోను చూపిస్తూ, ‘‘ఈ ఫొటో సృష్టించడం ఎంత సులభమైన పనో, ఎంతగా దుర్వినియోగ పరచవొచ్చో, ఎంతటి హాని కలిగించవచ్చో పార్లమెంటులోని ఇతర సభ్యుల అందరి దృష్టికి తీసుకెళ్లాను. ముఖ్యంగా, దేశ యువకులు, యువతులు జాగ్రత్త ఉండాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాను. ఈ ఫొటోను పార్లమెంట్ వేదికగా చూపించడానికి చాలా భయపడ్డాను. కానీ, డీప్‌ఫేక్ దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్ సెషన్‌లో ప్రదర్శించాను’’ అని మెక్‌క్లూర్ చెప్పారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు