Dangerous Temples: భారతదేశంలో ఎన్నో మిస్టరీ టెంపుల్స్, డేంజరస్ దేవాలయాలు ఉన్నాయి. భక్తులు తమ విశ్వాసంతో, భయాన్ని పక్కన పెట్టి కూడా ఈ పవిత్ర స్థలాలకు చేరుకుంటారు. అయితే, దేశంలో కొన్ని దేవాలయాలు మాత్రం భక్తిని మాత్రమే కాకుండా ధైర్యాన్ని కూడా పరీక్షిస్తాయి. ప్రమాదకరమైన మార్గాలు, మర్మమైన సంఘటనలు, అద్భుతమైన నిర్మాణాలు. ఇవన్నీ కలిపి ఆ దేవాలయాలను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇలాంటి మూడు భయానక, పవిత్రమైన దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కాకన్మతి ఆలయం – మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఉన్న కాకన్మతి ఆలయం (Kakanmath Temple) శివుడికి అంకితం చేయబడింది. 11వ శతాబ్దంలో పర్మార్ రాజవంశానికి చెందిన రాజు కాకన్‌దేవ్ ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. రాతితో నిర్మించిన ఈ ఆలయం దాని నిర్మాణ కౌశల్యంతోనే కాదు, మర్మమైన సంఘటనలతో కూడా ప్రఖ్యాతి పొందింది. ఆ ఆలయం ఎత్తు సుమారు 115 అడుగులు. రాళ్లను సాధారణ పరికరాలు లేకుండానే అమర్చడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ కారణంగానే ఈ ఆలయాన్ని భారతదేశంలో అత్యంత రహస్యమైన దేవాలయంగా పరిగణిస్తారు.
స్థానికుల ప్రకారం, ఆలయం చుట్టూ రాత్రిపూట విచిత్ర శబ్దాలు వినిపిస్తాయి. కొందరు దయ్యాల ఉనికిని కూడా అనుభూతి చెందారంటారు. తాంత్రిక కార్యకలాపాల కథలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అందుకే చాలా మంది ఈ ఆలయానికి వెళ్లే ముందు భయపడతారు, కానీ భక్తులు మాత్రం ధైర్యంగా శివుని దర్శించడానికి అక్కడికి వెళ్తూనే ఉంటారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్.. మెట్రోకు సమాంతరంగా రెండు ఫ్లై ఓవర్లు!
హరిహర్‌గఢ్ ఆలయం – మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న హరిహర్‌గఢ్ (Harihar Fort) కోటలో శివుడికి అంకితం చేసిన చిన్న ఆలయం ఉంది. ఈ కోటను భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పర్వత దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ కోట సముద్ర మట్టానికి సుమారు 3676 మీటర్ల ఎత్తులో ఉంది. కోటకు చేరుకోవడానికి 80 డిగ్రీల కోణంలో ఉన్న రాళ్లపై నిటారుగా ఉన్న మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మార్గం ఇరుకైనదిగా ఉండటంతో, ఒక్క చిన్న పొరపాటు జరిగిన ప్రాణానికి ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇంత కష్టమైన మార్గం ఉన్నప్పటికీ, భక్తులు తమ విశ్వాసంతో శివుడిని దర్శించేందుకు ఈ ప్రమాదకర ప్రయాణాన్ని చేస్తారు. సాహసాలను ఇష్టపడే యాత్రికులకు ఇది ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది.
గమనిక: ఈ కథనం భక్తి భావంతో మాత్రమే రాయబడింది. ఇందులో పేర్కొన్న విషయాలు భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఎవరికీ భయం కలిగించడం లేదా (అమాయక విశ్వాసం) ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం కాదు. దేవాలయ పూజలు, ఆచారాలు, నమ్మకాలు అన్నీ భక్తుల విశ్వాసానికి సంబంధించినవి. వాటిని గౌరవంతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
