Viral Video: ప్రస్తుతం ప్రతీ రంగంలోనూ డ్రోన్ సేవలు అత్యవసరంగా మారిపోయాయి. పోలీసుల పహారాకు డ్రోన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం, ఔషధాల సరఫరాకు సైతం వీటిని వినియోగిస్తున్నారు. అంతేకాదు శత్రు దేశాలకు చెందిన ఆర్మీ స్థావరాలను సైతం ధ్వంసం చేసే స్థాయికి డ్రోన్స్ చేరుకున్నాయి. అలాంటి డ్రోన్ సాంకేతికతను ఓ వ్యక్తి ఫన్నీగా ఉపయోగించి నెట్టింట నవ్వులు పూయించాడు.
వీడియో వైరల్..
డ్రోన్ కు సంబంధించిన ఒక వీడియో.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోను పరిశీలిస్తే.. డ్రోన్ కు ఒక కోడిని కట్టారు. అనంతరం దానిని రిమోట్ సాయంతో ఆపరేట్ చేశారు. దాదాపు 2 కేజీల వరకూ బరువున్న కోడిని డ్రోన్ అలవోకగా ఆకాశంలోకి మోసుకెళ్లడాన్ని వీడియోలో గమనించవచ్చు. అది కొంతదూరం విజయవంతంగా మోసుకెళ్తున్న క్రమంలో వీడియో ఆగిపోయింది.
Russian Drone. French edition. pic.twitter.com/xfwtG1k0y8
— Russian Market (@runews) October 4, 2025
నెటిజన్ల రియాక్షన్..
డ్రోన్ కు కోడిని కట్టిన వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు’ అంటూ స్మైలింగ్ ఏమోజీలను పెడుతున్నారు. ‘ఇకపై దానికి చికెన్ డ్రోన్స్ అని పేరు పెట్టాలేమో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘డ్రోన్స్ ను ఇలా కూడా ఉపయోగిస్తారా?. ఇన్నాళ్లు మాకు తెలియలేదే!’ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. మెుత్తం మీద ఈ చికెన్ విత్ డ్రోన్ వీడియో.. సోషల్ మీడియాలో విపరీతంగా నవ్వులు పూయిస్తోంది.
Also Read: Huma Qureshi: కుక్కలు చింపిన విస్తరిలా ఉంది.. ఈ టీషర్ట్ రూ.65 వేలట.. నటిని ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ఫన్నీ డ్రోన్ మూమెంట్స్..
డ్రోన్ కు సంబంధించి గతంలోనూ పలు ఫన్నీ వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. న్యూజిలాండ్ లో డ్రోన్ సాయంతో పిజ్జాలను డెలివరీ చేయాలని డొమినోస్ పిజ్జా భావించింది. ఈ క్రమంలో ఓ కస్టమర్ కు పిజ్జాను సరఫరా చేస్తుండగా.. బాక్స్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అలాగే 2018లో ఓ వ్యక్తి ఫ్యామిలీతో కలిసి సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. ఇందుకోసం డ్రోన్ ను వినియోగించే ప్రయత్నం చేశాడు. అయితే డ్రోన్ ఆ వ్యక్తి విగ్గును ఎగరేసుకొని పోవడంతో అక్కడి వారు నవ్వుకున్నారు.
