Innovative idea: రూ.16 లక్షల ఫ్లాట్‌‌.. లక్కీ డ్రా ఆఫర్
Viral-News
Viral News, లేటెస్ట్ న్యూస్

Innovative idea: భలే ఐడియా గురూ!.. రూ.16 లక్షల ఫ్లాట్‌ ఎవరూ కొనడం లేదని.. ‘మేధావి ప్లాన్’

Innovative idea: ఆవిష్కరణ ఆలోచన ధోరణి ఉండాలే కానీ, అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యంగా మారిపోతాయి. సంప్రదాయ మార్గాల్లో విజయాలు దక్కకపోతే, కాస్త విభిన్న ఆలోచనలతో ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే తలుపు తడతాయి. రంగం ఏదైనా అంకితభావంతో, కాస్త క్రియేటివిటీ ఆలోచిస్తే (Innovative idea) చిన్న అవకాశం కూడా గొప్ప విజయంగా మారుతుంది. అలాంటి విజయాన్నే అందుకునేందుకు చివరి మెట్టుపై నిలిచాడు తెలంగాణకు చెందిన రామబ్రహ్మం అనే యువకుడు.

హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన రామబ్రహ్మం రూ.16 లక్షలు విలువ చేసే 66 గజాల ప్లాట్‌ను విక్రయించడానికి ప్రయత్నించాడు. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ప్రయత్నం సఫలం కాలేదని అతడేం బాధపడలేదు. కాస్త వినూత్నంగా ఆలోచించి.. ప్లాట్ కొనేందుకు ముందుకు రాని జనాలే వద్దన్నా కొనడానికి ముందుకొచ్చే ‘మేధావి ప్లాన్’ వేశాడు. ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు. రూ.500 చొప్పున 3000 కూపన్లు ముద్రించి లక్కీ డ్రా ఆఫర్ పెట్టాడు. నవంబర్ 2న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు అతడు ప్రకటించాడు. ఈ డ్రాలో విజేతగా నిలిచిన వ్యక్తి కేవలం రూ.500లకే ఆ ప్లాట్‌ను పొందనున్నాడు. లక్కీ డ్రాలో పాల్గొనేవారు నిబంధనలు, చట్టపరమైన ప్రక్రియలు పాటించాల్సి ఉంటుందని సూచిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఆఫర్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also- Cough Syrup Deaths: దగ్గు సిరప్ తాగి ఆరుగురు చిన్నారుల మృతి.. తీవ్ర విషాదం

కాగా, ఇదివరకు అమ్మకానికి పెట్టినంత రూ.16 లక్షలు రాకపోయినా, కూపన్లు అన్నీ అమ్ముడుపోతే రామబ్రహ్మానికి ఒక లక్ష తక్కువగా రూ.15 లక్షలు గ్యారంటీగా వస్తాయి. ప్లాట్ విక్రయించేందుకు సంప్రదాయ విధానాలకు కాస్త భిన్నంగా ప్రకటించిన ఈ ఆలోచన జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కేవలం రూ.500లకే ప్లాట్ అంటే కొనుగోలుదారుల ఎక్కువగా ఆలోచించే అవకాశమే ఉండదు. తక్కువ ఖర్చుతో భూమిని పొందొచ్చని భావిస్తారు. కాబట్టి, కూపన్లు కొనుగోలు చేసేందుకు ఎగబడే అవకాశం లేకపోలేదు.

Read Also- DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి

రామబ్రహ్మం తెలివితేటలపై నెటజన్ల పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘‘రూ.15 లక్షలకు కచ్చితంగా వస్తాయి. ఇది కదా మాస్ అంటే’’ అని ఒకరు సరదా కామెంట్ పెట్టారు. మరో వ్యక్తి స్పందిస్తూ, ‘‘ఇక్కడ నాకొక ఐడియా వస్తోంది. ఆ విన్నింగ్ కూపన్‌ని అతడి స్నేహితుడు, లేదా బాగా నమ్మకస్తులైన వ్యక్తికి ఇస్తే!. ప్లాట్‌తో పాటు డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ, ఆ లక్కీ విన్నర్ చివరికి రామబ్రహ్మమే అవుతానంటూ సందేహం వ్యక్తం చేశాడు. ఇంకో వ్యక్తి స్పందిస్తూ, ఇంతకీ ఇది చట్టబద్ధమేనా, కాదా అని సందేహం వ్యక్తం చేశాడు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?