Chicken: చికెన్ మనకీ తక్కువ ధరకే దొరుకుతుంది. కాబట్టి చాలా మంది దీనిని తింటారు. రెడ్ మీట్‌తో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైనదిగా చెబుతున్నారు వైద్యులు. అలాగే, ఇది ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. అయితే, చికెన్‌లోని అన్ని భాగాలు తినడానికి సురక్షితమా? పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని భాగాలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు. ఈ భాగాలను తినే ముందు రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. కింది భాగాలు ఎందుకు నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం..
మెడ (Chicken Neck)
చికెన్ మెడ సూప్‌లు లేదా బ్రోత్‌ల తయారీలో రుచికరంగా ఉపయోగపడుతుంది. కానీ, ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ప్రదేశం. సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా పూర్తిగా ఉడకనప్పుడు సూక్ష్మక్రిములు మిగిలే అవకాశం ఉంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సురక్షితంగా ఉండాలంటే, మెడను పూర్తిగా మానేయడమే మంచిది.
తల (Chicken Head)
కొన్ని సాంప్రదాయ వంటకాల్లో చికెన్ తలను ఉపయోగిస్తారు, కానీ ఇది పర్యావరణ కాలుష్య కారకాలైన మందులు, కలుషిత ఆహార సేకరించగలదు. ఇవి శరీరంలో చేరితే అనారోగ్య ప్రమాదం పెరుగుతుంది. అందుకే, చికెన్ తలను తినడం మానేయడం ఉత్తమం.
పాదాలు (Chicken Feet)
కోడి పాదాలు నేలను తాకుతుంటాయి. దీని వల్ల ధూళి, బ్యాక్టీరియా, ఇతర కలుషితాలు సులభంగా చేరతాయి. ఎంత శుభ్రం చేసినా, పూర్తిగా కాలుష్య రహితంగా ఉండటం కష్టం. ఈ భాగాన్ని తినడం కంటే పారేయడమే మంచిది.
పేగులు (Chicken Intestines)
చికెన్ పేగులు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములకు నిలయంగా ఉంటాయి. ఎంత శుభ్రం చేసినప్పటికీ దానిలోక్రిములు ఉంటాయి. ఇవి ఆహార విషం లేదా ఇతర ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఎక్కువ. అందుకే, పేగులను తినకపోవడమే మంచిది.
ఎముక మజ్జ (Bone Marrow)
ఎముక మజ్జ చాలా రుచికరంగా ఉంటుంది, ఇది కొన్ని రకాల వంటలలో ఉపయోగించబడుతుంది. కానీ, సరిగ్గా ఉడకనప్పుడు లోపల రక్తం మిగులుతుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎముకలను బాగా ఉడికించి తినండి లేక ఈ భాగాన్ని నివారించడం మంచిది.
