AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 976 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, దరఖాస్తు విధానం, ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి చదవాలని సూచించారు.
దరఖాస్తు రుసుము
సాధారణ వర్గం: రూ. 300/- ను చెల్లించాలి.
మినహాయింపు: SC/ST, మహిళా అభ్యర్థులు, PwBD అభ్యర్థులు, AAIలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28 ఆగస్టు 2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 27 సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది.
వయోపరిమితి
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
వయో సడలింపు: OBC (NCL): 3 సంవత్సరాలు
SC/ST: 5 సంవత్సరాలు
PwBD: 10 సంవత్సరాలు (పోస్ట్‌కు అనుగుణంగా)
అర్హత
అభ్యర్థులు కింది విద్యార్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి. B.Arch (ఆర్కిటెక్చర్, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌తో రిజిస్టర్ చేయబడి ఉండాలి)
B.Tech/B.E (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ)
MCA
జీతం
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (గ్రూప్-B: E-1): రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు వేతనాన్ని చెల్లిస్తారు.
ఇతర ప్రయోజనాలు: DA, HRA, CPF, గ్రాట్యూటీ, వైద్య సౌకర్యాలు (సంవత్సరానికి సుమారు రూ. 13 లక్షల CTC)
AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
ఖాళీల వివరాలుజూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 11 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ – సివిల్): 199 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్ – ఎలక్ట్రికల్): 208 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 527 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 31 పోస్టులు
ఎంపిక విధానం
జూనియర్ ఎగ్జిక్యూటివ్: GATE 2023/2024/2025 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు విధానం
1. AAI అధికారిక వెబ్‌సైట్ www.aai.aeroలోని ‘Careers’ విభాగాన్ని సందర్శించండి.
2. “AAI Junior Executive Recruitment 2025” నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ లింక్‌లో పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేయండి.
4. లాగిన్ చేసి, విద్యా వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించండి.
5. దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి.
ఈ నియామకం AAIలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం. గడువు తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.