Sajjala Ramakrishna: వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని 33 మందితో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అలాగే, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.
Also Read: TG LRS: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం క్లారిటీ .. రియల్ ఎస్టేట్ వ్యాపారులు..ఆ ఎమ్మెల్యేకు సత్కారం!
కమిటీ సభ్యులు వీరే
పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో తమ్మినేని సీతారాం, పీడిక రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖర్, ఎంపీ గొల్ల బాబురావు, బూడి ముత్యాలనాయుడు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుప్పాల శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ బాబు, ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళత్తూరు నారాయణ స్వామి, ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, షేక్ అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగుండ్ల శంకర నారాయణ, తలారి రంగయ్య, వై.విశ్వేశ్వర రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్‌లను సభ్యులుగా అధిష్టానం నియమించింది.
ఎందుకిలా?
వాస్తవానికి సజ్జల ఏదైనా సభలో లేదా సమావేశంలో కనిపిస్తే చాలు వైసీపీ శ్రేణులు కొందరు, జగన్ వీరాభిమానులు భగ్గుమంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పట్నుంచీ, నేటి వరకూ ఆయనంటే వైసీపీలో ఓ వర్గానికి అస్సలు పడట్లేదు. అంతేకాదు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి వన్ అండ్ ఓన్లీ సజ్జల మాత్రమేనని, నాడు సఖల శాఖమంత్రిగా పనిచేసి పార్టీని సర్వనాశనం చేశారని కార్యకర్తలు, ముఖ్య నేతల నుంచే తీవ్ర ఆరోపణలు చాలానే ఉన్నాయి. మరోవైపు జగన్‌కు రైట్, లెఫ్ట్ హ్యాండ్‌గా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి ముఖ్యనేతలు పార్టీని వీడటానికి కారణం కూడా సజ్జలేనని కార్యకర్తలు చెబుతూ ఉంటారు. ఇంత చేసినా సజ్జలకు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆయన పార్టీకి అవసరమా? సజ్జలతో పార్టీకి ఒరిగేదేమైనా ఉందా? కార్యకర్తల మనోభావాలను పదే పదే ఎందుకు దెబ్బతీస్తున్నారు? అసలు గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతోందో? సజ్జల గురించి ఏం మాట్లాడుకుంటున్నారో పట్టించుకోకపోతే ఎలా? ఇలా పలు ప్రశ్నలు వైఎస్ జగన్‌పై కార్యకర్తలు కొందరు సంధిస్తున్నారు.
Also Read: vishakha: ఆహా.. ఇది కదా పోలీస్ అంటే.. వీరు చేసిన పనికి సెల్యూట్!