Uttam Kumar Reddy: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బుద్ధి చెప్పామని అన్నారు. ఆంధ్రకు టిఆర్ఎస్ ప్రభుత్వం లోనే నీళ్లు ఇచ్చామని కెసిఆర్ చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టుకు 7000 కోట్లు ఖర్చు చేశామని.. 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్.. 7 లక్షల కాంక్రీట్.. తొమ్మిది లక్షల లేజర్మెంట్.. 11 పంపులు ఇన్స్టాలేషన్ చేశామని వివరించారు. టిఆర్ఎస్ ఒక పంపు ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు.
ప్రాజెక్టుల కోసం 1.83 లక్షల కోట్లు ఖర్చు
ప్రాజెక్టుకు హైడ్రాలజీ, ఎన్విరాన్మెంట్, ఇరిగేషన్ ఏ ఒక్క అనుమతి లేదని చేయలేదని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లోనే డిపిఆర్ రిటర్న్ అయిందని.. దానికి మేము వివరణ ఇచ్చామన్నారు. 45 టీఎంసీలు పాలమూరు మైనర్ ఇరిగేషన్ కు ఉపయోగించుకుంటామని టిఆర్ఎస్ ఇచ్చిందని ఇప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. హరీష్ రావు అంత తెలివితేటలు లేకపోవచ్చు కానీ మేము ఎంతో కొంత చదువుకున్నామని అన్నారు. హరీష్ రావు మాటలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల సాగర్ ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టిందని.. 1600 కేటాయిస్తే అవి పూర్తి అయ్యేవన్నారు. కానీ టిఆర్ఎస్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 1.83 లక్షల కోట్లు ఖర్చు చేశారని వీటిని మాత్రం నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూరు శాతం పూర్తి చేస్తామని వెల్లడించారు.
Also Read: Uttam Kumar Reddy: ఇరిగేషన్ ప్రాజెక్టులను నాశనం చేసిందే కేసీఆర్: మంత్రి ఉత్తమ్ ఫైర్..!
పాలమూరు జిల్లాలపై ఎందుకు పక్షపాతం
ఒక్క కాలేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు చేశారని పాలమూరుకు 27 వేల కోట్లు ఇంత తక్కువగా ఎందుకు పెట్టారని నిలదీశారు. కాలేశ్వరం పై ఉన్న ప్రేమ పాలమూరుపై ఎందుకు లేదని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు ఈఎంసి గా పని చేసిన మురళీ ధర్కు ఒక టీఎంసీ కి పాలమూరును తగ్గించాలని 2020లో చెప్పారని ఇది బిఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి అని మండిపడ్డారు. నల్గొండ పాలమూరు జిల్లాలపై ఎందుకు పక్షపాతం అని ఆవేదన వ్యక్తం చేశారు. మోసం దగా చేసి.. ఇతరులపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చేసిన తప్పులకు సిగ్గుతో తలవంచుకోవాలి అన్నారు. తెలంగాణకు 299 టిఎంసిలు, ఏపీకి 512 టీఎంసీలు కృష్ణాజిల్లాలో ఒప్పందం చేసుకునే టిఆర్ఎస్ అని.. అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ హరీష్ రావు ఒప్పుకున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు సైతం తమ దగ్గర ఉన్నాయన్నారు.
ఇరిగేషన్ చరిత్రలోనే ఇది దుర్మార్గం
కేసిఆర్ ఒప్పుకున్నా 299 టీఎంసీలలో పాలమూరు ప్రాజెక్టు ప్రస్తావన లేదని.. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల సాగర్, ఎస్ ఎల్ బి సి, దిండి ప్రాజెక్టులకు సైతం నీరు అడగలేదన్నారు. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయిన పూర్తి చేశారా అని నిలదీశారు. లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం కూలిందని.. పాలమూరు పూర్తి చేయలేదని, సీతారామ దేవాదుల పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. పాలమూరుకు 27000 కోట్లు కేటాయించి ఒక్క ఎకరాయకట్టుకు నీరు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో ద్వయం ఇచ్చారు. రాయలసీమ ప్రాజెక్టుకు ఏపీ అక్రమంగా కృష్ణా జలాల తరలింపుకు సహకరించిందే కేసీఆర్ అని అన్నారు. ప్రతిరోజు మూడు టీఎంసీల నీటిని తరలింపుకు కారణమే కేసీఆర్ అని అన్నారు. ఇరిగేషన్ చరిత్రలోనే ఇది దుర్మార్గం అన్నారు.
మూడేళ్లలో ఎస్ఎల్ బీసి పూర్తి చేస్తాం
కాంగ్రెస్ పార్టీ పోరాడి ఆ పనులు ఆపించిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలు ఏపీకి డైవర్షన్ అయితే… కెసిఆర్ సీఎం అయ్యాక శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 1442.07 టీఎంసీలు కృష్ణాజిల్లాలో ఏపీ తరలించక పోయిందన్నారు. కృష్ణ జనాల విషయంలో ఎవరు న్యాయం చేశారని ప్రజలే గ్రహించాలని సూచించారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ పాలనలోని తెలంగాణకు ఎక్కువ మోసం దగా జరిగిందన్నారు. మూడేళ్లలో ఎస్ ఎల్ బీ సి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను కేసీఆర్ ఏడాదిన్నర కాలంలో కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చి పూర్తి చేయలేదని మండిపడ్డారు. ప్రాజెక్టులో కమిషన్లు హరీష్ రావుకు అలవాటని తమకు కాదన్నారు. ఏదో అద్భుతాలు చేసినట్లు కేసిఆర్ ఫ్యామిలీ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లోకి నిజం పోవాలని తాము మాట్లాడుతున్నామని వెల్లడించారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం నడుపుతామని వెల్లడించారు. పి పి టి కి అవకాశం ఇస్తే ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్తారా అని నిలదీశారు.
Also Read: Uttam Kumar Reddy: ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించాలని కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ

