Uttam Kumar Reddy: రాష్ట్ర ఆర్థిక భారం తగ్గించాలని ఉత్తమ్ లేఖ
Uttam Kumar Reddy (imagecredit:twitter)
Telangana News

Uttam Kumar Reddy: ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించాలని కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ

Uttam Kumar Reddy: తెలంగాణలో కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ కార్యకలాపాలు నిరాటంకంగా జరిగేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Minister Pralhad Joshi)కి ఆదివారం లేఖ రాశారు. తెలంగాణకు ఖరీఫ్ సీజన్‌కు అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కేటాయించాలని కోరారు. రబీ ధాన్యం ఎక్కువగా బాయిల్డ్ రైస్‌గా మార్చడానికి అనుకూలంగా ఉంటుందని లేఖలో ప్రస్తావించారు.

అదనపు రైలు బోగీలను..

ఖరీఫ్ 2024 – 25కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ(Custom milled rice delivery) గడువు ఈ ఏడాది నవంబర్ 12న ముగిసిందని, మిల్లర్ల వద్ద మిగిలి ఉన్న 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్(Joint physical verification) నివేదికతో పాటు గడువును కూడా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. అంతేకాకుండా ఎఫ్‌సీఐ(FCI) గోదాముల నుంచి బాయిల్డ్ రైస్ రవాణాకు అదనపు రైలు బోగీలను తక్షణమే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రవాణాలో 13.5 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడటం వల్ల తెలంగాణలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సరిపోదని పెంచాలని కోరారు.

Also Read: Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రూ.1,468 కోట్ల పెండింగ్

రాష్ట్రంలో ప్రస్తుతమున్న 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం సరిపోదని, సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలు, ఎంఎస్‌పీ కార్యకలాపాలను సులభతరం చేయడానికి కేంద్ర నిల్వ పథకాల కింద అదనంగా 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2014 – 15కు సంబంధించి రూ.1,468 కోట్ల పెండింగ్ సబ్సిడీ, పీఎం జీకేఏవై కింద ఏప్రిల్ 2022లో పంపిణీ చేసిన 89,988 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్ల సబ్సిడీని తక్షణమే విడుదల చేయాలని మంత్రి తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకుని రైతులకు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Also Read: Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Just In

01

Google Phone App: డూ నాట్ డిస్టర్బ్ ఉన్నా ఫోన్ మోగుతుంది.. గూగుల్ ఫోన్‌లో ‘ఎక్స్‌ప్రెసివ్ కాలింగ్’ ఫీచర్

Harish Rao: సిద్దిపేటలో ఫలించిన హరీష్ రావు వ్యూహం.. ఎక్కువ స్థానాల్లో గెలుపు!

Jagga Reddy: నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి రావడం హరీష్ రావు కారణం కాదు: జగ్గారెడ్డి

MS Subbulakshmi: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కించనున్న గీతా ఆర్ట్స్!.. దర్శకుడు ఎవరంటే?

Bigg Boss9: బిగ్ బాస్ సీజన్ 9 అల్టిమేట్ యోధులు వీరే.. చివరిగా బిగ్ బాస్ చెప్తుంది ఏంటంటే?