TG Heatwave alert [image credit: swetcha reporter]
Uncategorized

TG Heatwave alert: ఎఫ్‌టీఎల్ ప్రక్రియ వేగవంతం చేయండి.. హైడ్రా కమిషనర్ ఆదేశం

TG Heatwave alert: చెరువులు, కుంటలు వాటిల్లోని ఆక్రమణలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెలే ను నిర్థారిస్తేనే పరిష్కారమవుతాయని హైడ్రా కమిషనర్ రంగనాధ్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎఫ్ టీఎల్ ను నిర్థారించటంలో ప్రజల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ప్రతి చెరువుకు ఎఫ్ టీఎల్ ను ఫిక్స్ చేసే ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

సంబంధిత శాఖ‌ల నుంచి సేక‌రించిన స‌మాచారంతో పాటు సాంకేతిక‌ ప‌రిజ్ఞానాన్ని వినియోగించి, ఎఫ్‌టీఎల్ ను నిర్థారించే సమయంలో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలనైు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌కు ఉద్దేశించి రూపొందిస్తున్న లేక్ ఎన్యూమ‌రేష‌న్ యాప్ లో అభ్యంత‌రాలు చెప్ప‌డానికి ప్ర‌త్యేక కాల‌మ్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

 Also Read: TG AI Engineers: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లకై సర్కార్ కసరత్తు..

హైడ్రా ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి ఇదే అంశంపై ఎక్కువ మొత్తంలో వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో కమిషనర్ ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ విషయాన్ని ప్రస్తావించారు. చెరువుల్లో ఓ వైపు నుంచి మ‌ట్టిని నింప‌డంతోపాటు మురుగు నీరు నిరంత‌రంగా వ‌చ్చి చేర‌డంతో ఎఫ్‌టీఎల్ ప‌రిధులు మారిపోతున్న నేప‌థ్యంలో ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ వేగంగా జ‌ర‌గాల్సి ఉంద‌ని సూచించారు.

గ్రామ‌, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేష‌న్, స‌ర్వే ఆఫ్ ఇండియా రికార్డుల‌తో ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్‌ ఇమేజీల‌తో ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌త్యేకంగా ఒక నిపుణుల క‌మిటీని కూడా వేసి.. ఎలాంటి అపోహ‌ల‌కు ఆస్కారం లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు ఫిర్యాదుదారుల‌కు వివ‌రించారు.

Vikramarka on HCU Issue: డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. విద్యార్థులపై ఉన్న కేసులను తీసివేయండి..

అలాగే ప‌లు కాల‌నీల మ‌ధ్య ర‌హ‌దారుల‌కు ఆటంకాలు క‌లిగించ‌డం, పాత లే ఔట్ల హ‌ద్దుల‌ను ప‌ట్టించుకోకుండా, క‌బ్జా చేయ‌డం, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ప్లాట్లుగా చేసి అమ్మేయ‌డం వంటి ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 57 ఫిర్యాదులందినట్లు, వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారుల‌కు పంపినట్లు, అధికారులు ప్రతి ఫిర్యాదును కూడా బాధ్యతాయుతంగా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు