Google Gemini: గూగుల్ తన ఏఐ టూల్స్‌ని మరింత ఎక్కువ మంది వాడాలనే ఉద్దేశంతో Google Gemini వార్షిక ప్లాన్‌పై లిమిటెడ్ టైమ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ముఖ్యంగా కొత్తగా సబ్‌స్క్రైబ్ అయ్యేవాళ్లకే వర్తిస్తుంది. ఆఫర్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ప్లాన్ ఆటోమేటిక్‌గా రెగ్యులర్ ధరకు రెన్యూ అవుతుంది.
Also Read: Anunay Sood: భారతీయ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనునయ్ సూద్ మరణానికి కారణం ఇదే.. ఏం జరిగిందంటే?
Gemini వార్షిక ఆఫర్‌లో ఏముంటుంది?
ఈ ఆఫర్‌లో మీరు Gemini Pro ఫీచర్లను మొత్తం ఏడాది తక్కువ ధరకే వాడుకోవచ్చు. ఫ్రీ వెర్షన్‌తో పోలిస్తే, ఇందులో ఎక్కువ యూజ్ లిమిట్స్ ఉంటాయి. పెద్ద ప్రశ్నలు అడగచ్చు, కాస్త క్లిష్టమైన పనులు చేయించుకోవచ్చు, అలాగే ఫోటోలు, ఫైళ్లు కలిపి అడిగే అడ్వాన్స్‌డ్ ఏఐ టాస్క్‌లకూ సపోర్ట్ ఉంటుంది.
డీప్ రీసెర్చ్, ఫైళ్లతో పని చేయడం ఈజీ
ఈ ప్లాన్‌తో Deep Research అనే ఫీచర్ కూడా వస్తుంది. దీని ద్వారా నెట్‌లో ఉన్న సమాచారాన్ని ఒక క్రమంలో అనాలిసిస్ చేయించుకోవచ్చు. అలాగే ఫైళ్లను అప్‌లోడ్ చేసి పని చేయడం మరింత సులభంగా ఉంటుంది. కొత్తగా వచ్చే Gemini ఫీచర్లు ముందుగానే ట్రై చేసే ఛాన్స్ కూడా ఇస్తారు. రోజూ ఆఫీస్ పని, చదువు లేదా కంటెంట్ క్రియేషన్ కోసం ఏఐ వాడేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
2TB క్లౌడ్ స్టోరేజ్ & ఫ్యామిలీతో షేర్ చేసే అవకాశం
ఈ Gemini వార్షిక ప్లాన్‌లో 2TB గూగుల్ స్టోరేజ్ కూడా ఫ్రీగా వస్తుంది. దీనిని Google Drive, Gmail, Photos లాంటి యాప్స్‌లో వాడుకోవచ్చు. ఇంకా, ఈ ప్లాన్‌ను ఇంకా ఐదుగురితో షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే ఒకే ప్లాన్‌తో ఇంట్లో వాళ్లకూ స్టోరేజ్ ఉపయోగపడుతుంది.
ఎవరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది? రెన్యువల్ ఎలా ఉంటుంది?
ఈ తగ్గింపు ధర కొత్తగా Gemini సబ్‌స్క్రైబ్ అయ్యేవాళ్లకే. ఆఫర్ అయిపోయాక ప్లాన్ ఆటోమేటిక్‌గా సాధారణ వార్షిక రేటుకు మారిపోతుంది. అయితే, కావాలంటే ఎప్పుడైనా మీ Google అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్లాన్‌ను క్యాన్సల్ చేయచ్చు లేదా మార్చుకోవచ్చు. ఈ ఆఫర్ ఎప్పుడు వరకు ఉంటుందో గూగుల్ స్పష్టంగా చెప్పలేదు.
గూగుల్ ప్లాన్ వెనక ఉన్న స్ట్రాటజీ
ఒకే ప్లాన్‌లో శక్తివంతమైన ఏఐ టూల్స్, ఎక్కువ లిమిట్స్, Geminiని లాంగ్‌టర్మ్ వాడేలా చేయడమే గూగుల్ టార్గెట్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు ఏఐ సబ్‌స్క్రిప్షన్ మార్కెట్‌లో పోటీ బాగా పెరిగిన టైంలో, కేవలం ఏఐ పవర్ మాత్రమే కాకుండా వాల్యూ ఫర్ మనీ ప్యాకేజెస్ కూడా ఎంత ముఖ్యమో ఈ ఆఫర్ చూపిస్తోంది.

