Cyber Crime (imagecredit:stwitter)
Uncategorized

Cyber Crime: హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరుతో ఫేక్ ఖాతాలు

Cyber Crime: రకరకాలుగా మోసాలు చేస్తూ లక్షలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్(Cybercriminals) ఈసారి ఏకంగా హైదరాబాద్(Hyderabad) కమిషనర్ వీ.సీ. సజ్జనార్‌(V.C. Sajjanar)నే లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన పేరు మీద ఫేస్‌బుక్‌లో ఫేక్ ఖాతాలు తెరిచి, అత్యవసరం ఉందంటూ డబ్బు వసూళ్లకు ప్రయత్నించారు.

కమిషనర్ అప్రమత్త

ఈ క్రమంలో కమిషనర్‌తో స్నేహం ఉన్న ఒక వ్యక్తి, సైబర్ క్రిమినల్స్ ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఆన్‌లైన్ ద్వారా రూ.20 వేలు పంపించి మోసపోయారు. విషయం తెలిసిన వెంటనే కమిషనర్ అప్రమత్తమయ్యారు. తన పేరు మీద ఫేస్‌బుక్‌లో అకౌంట్లు తెరిచి డబ్బు అవసరం ఉందని సైబర్ క్రిమినల్స్ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘ఈ ఫేక్ ఖాతాలను ఎవ్వరూ నమ్మవద్దు. ఎవ్వరినీ డబ్బు అడిగే అవసరం నాకు లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Vijayendra Prasad: ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పింది వెంటే పూనకాలే..

అనుమానాస్పద లింకులు

అంతేకాకుండా, ప్రజలు అనుమానాస్పద లింకులు, మెసేజీలు(Messages), వీడియో కాల్స్(Video Cals) వస్తే వాటిని వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు. ఎవరైనా మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కమిషనర్ పేరు మీద ఫేక్ ఖాతాలు ఎవరు తెరిచారు? అనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు.

Also Read: Jogulamba Gadwal: గ్రామాల్లో గజ్జుమనిపిస్తున్న గ్రామ సింహాలు.. జిల్లాలో ఐదు నెలల్లోనే 720 కేసులు నమోదు

Just In

01

Shiva Re-Release: నాగార్జున ‘శివ’ రెండు రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రీ రిలీజ్‌కు ఇంత క్రేజా..

Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం 123 కోట్లు: మంత్రి వాకిటి శ్రీహరి

Kolkata Test: కోల్‌కతా టెస్టులో భారత్ ఓటమి.. దక్షిణాఫ్రికా ఉత్కంఠభరిత విజయం

Cyber Crime: ఓరి నాయనా ఐటీ కమిషనర్‌కే టోపి పెట్టిన సైబర్ నేరగాళ్లు..40 వేలు స్వాహ..!

Cyber Crime: హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరుతో ఫేక్ ఖాతాలు