Bigg Boss: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 8 సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బుల్లితెర షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. త్వరలో సీజన్-9లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ బిగ్‌బాస్ షోకి మంచి ఆదరణ ఉంది. అయితే ఎంత క్రేజ్ ఉందో అంతే విమర్శలు కూడా వచ్చాయి. ఆ అన్నింటిని దాటుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో 10 భాషల్లో కోనసాగుతోంది. మొదటగా హిందీలో స్టార్ట్ అయిన ఈ షో ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వంటి లాంగ్వేజ్‌స్‌లలో మొదలైంది.
ఇక తెలుగులో ప్రారంభమైన ఈ షోకి సీజన్-1 యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యహరించిన సంగతి తెలిసిందే. ఇక సీజన్-2కి నాని హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడోవ సీజన్ నుంచి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తనదైన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ ఆటతీరుపై విశ్లేషణ చేయడం ఈ షోకి మరింత క్రేజ్ పెరిగింది. ఆటగాళ్ల ప్లెస్.. మైనస్‌లు చెప్పేవాడు. అందరు ఆటగాళ్లు బాగా ఆడేందుకు ఎంకరేజ్ చేసేవాడు. హౌస్ మేట్స్‌ని నవ్విస్తూ.. ఇటు ప్రేక్షకులను అలరిస్తూ సందడి చేసేవాడు. అయితే ఇటీవల సీజన్ -8 విజవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆడియన్స్‌కి ఎవరూ తెలిసిన మొఖాలు రాకవడంతో రేటింగ్ భారీగా తగ్గింది. ఇక సీజన్-9కి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈసారి షో రేటింగ్ భారీగా పెందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన వ్యక్తులను ఈ షోకు కంటెస్టెంట్స్‌గా సెలక్ట్ చేస్తున్నారట.
Also Read: టాలీవుడ్ లక్కీ గర్ల్.. చేసిన మూవీస్ అన్ని సూపర్ హిట్లే!
అలాగే, సీజన్-9కి మరింత కొత్తతనం తెచ్చేనందుకు హోస్ట్‌ని కూడా మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వరుసగా 6 సీజన్-లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈసారి మంచి క్రేజ్ ఉన్న హీరో పెడితే బాగుండని ఆలోచిస్తున్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండని బిగ్‌బాస్ సీజన్-9కి హోస్టుగా చేయాలని టీమ్ సంప్రదించిందట. ఇందుకు భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారట. దీంతో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ టీమ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సీజన్ -9 బాగా హైప్ క్రీయేట్ కానుంది. ఒక డిఫరెంట్ మాటతీరుతో రౌడీ బాయ్ అలరించనున్నాడు. అయితే ఈ హీరో కంటే ముందు నటసింహం నందమూరి బాలకృష్ణని కాంటాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షోతో బాలయ్య సందడి చేస్తూ, మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్ సీజన్ -9కి హోస్టుగా చేయమని అడిగితే ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఇక మొత్తానికి సీజన్ -9 ఈసారి మాత్రం సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. చూడాలి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వచ్చి అలరిస్తారో.