Tollywood: సంయుక్త మీనన్(Samyukta Menon).. మలయాళ చిత్రం పాప్‌కార్న్‌తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీలో ఈ మలయాళం బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బింబిసార, విరూపాక్షి మూవీస్‌తో సూపర్ హిట్స్‌ను తన అకౌంట్లో వేసుకుంది. విరూపాక్షలో అద్భుత నటనతో ఉత్తమ నటిగా అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ చిత్రంతో నటవిశ్యరూపం చూపించి ఆడియన్స్‌ని భయపెట్టింది. తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. తర్వాత సార్ మూవీతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ధనుష్ సరసన నటించి మెప్పించింది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ.. ఈ మలయాళం ముద్దుగుమ్మ సందడి చేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సంయుక్త ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ‘మహారాజ్ఞి అనే మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. బ్యూటీ సంయుక్త మీనన్‌ను టాలీవుడ్‌లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న హీరోయిన్ అని అంటున్నారు. దీనికి కారణం ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ కావడం విశేషం. పేరుకు మలయాళ హీరోయినే అయినా.. టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లేత కుర్రాళ్ల మనస్సును దోచేసింది. ఈ కుర్ర హీరోయిన్ అంటే యూత్ తెగ చచ్చిపోతున్నారు. ఆమె మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే.. ఈ క్రేజీ గర్ల్ ఫోటోలు షేర్ చేస్తూ ఫిదా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ కుర్రాళ్లను మైమరిపిస్తుంటుంది. అయితే మలయాళంలో అరంగ్రేటం చేసిన ఈ అందాల తార.. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల నటించిన ఈ భామ నటించిన మూవీస్ అన్ని హిట్ కావండంతో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో దూసుకెళుతోంది.
Also Read: హీరోయిన్‌కి వరుసగా హిట్స్.. అయినా రానీ క్రేజ్!
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త.. తాను డ్రింక్ కూడా చేస్తానని చెప్పడం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. వరుసగా షూటింగ్స్ చేస్తూ స్ట్రెస్‌కు గురైనప్పుడు మద్యం సేవిస్తా అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెపై మనసు పారేసుకున్న ఎంతో మంది ఫ్యాన్స్ ఈ అలవాటు కూడా ఉందని ఫీల్ అవుతున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘బింబిసార 2’, నందమూరి బాలక్రిష్ణ ‘అఖండ2’లో నటిస్తోంది. మొత్తానికి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మలయాళం బ్యూటీ హవా టాలీవుడ్‌లో ఇలా కొనసాగుతుందో చూడాలి.