ఉన్నత స్థానంలో స్థిరపడినా.. సేవ చేస్తేనే వారి మనసుకు తృప్తి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే సాఫ్ట్‌వేర్ కంపెనీల స్థాపన
నిరుద్యోగులకు అండగా ఉన్నత ఉద్యోగాల కల్పన
ఖమ్మం, స్వేచ్ఛ: వారు వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వారి ప్రవృత్తి మాత్రం నిరుపేదలను ఆదుకోవడం, విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడం. ఉన్నత విద్య చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు కల్పించడం వారి జీవిత లక్ష్యంగా మారిపోయింది. వారే బత్తినేని సోదరులు ప్రకాష్ -రాజేష్ (Bathineni brothers). వీరిద్దరూ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బత్తినేని నాగప్రసాదరావు -నీరజల కొడుకులు. తండ్రి వ్యవసాయ కో-ఆపరేటివ్ బ్యాంకులో పని చేస్తూ ఇద్దరినీ ఉన్నత విద్య చదివించారు. తదానుగుణంగా ఇద్దరూ మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా మారిపోయారు.
పెద్ద కొడుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ఉంటూ తన ప్రతిభను చాటుకుంటూ సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు బీజం వేశారు. రెండో కొడుకు రాకేష్ బీటెక్ చదివిన తర్వాత ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి అయ్యాక అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయితే, జీవితంలో ఇంకేదో సాధించాలని భావించారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలను స్థాపించాలని లక్ష్యంతో ముందుకు సాగారు. పుట్టిన జిల్లా కేంద్రం ఖమ్మంలో రేయాన్ సాఫ్ట్‌వేర్, బత్తినేని టెక్నో పోలీస్, సావరన్, యురేకా డేటా మాటిక్స్, టెక్స్ స్కై ఏ వన్ పయనీర్ పేర్లతో ఐటీ కంపెనీలను స్థాపించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ ఇలాంటి కంపెనీలను స్థాపించారు. ఒకరు హైదరాబాదులో ఉంటూ… మరొకరు అమెరికా డల్లాస్‌లో ఉద్యోగం చేస్తూ తమ కాంక్షను నెరవేర్చేలా ఐటీ కంపెనీలను స్థాపించారు. సొంత ప్రాంతంలో ఉన్నత విద్య అభ్యసించిన వారందరికీ ఉద్యోగ కల్పనల కోసం కృషి చేస్తున్నారు.
సేవ చేస్తేనే మనసుకు తృప్తి
సామాన్య కుటుంబంలో పుట్టిన బత్తినేని సోదరులు ప్రకాష్ -రాకేష్ ఇద్దరూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయినప్పటికీ వారు తృప్తి చెందలేదు. డబ్బు సంపాదన కంటే మనసు తృప్తి పొందేందుకు ఇద్దరూ సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించిన వారికి ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు. ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు. మూలాలను విడిచిపెట్టకుండా, గతంలో పడిన కష్టాలు, పల్లె వాసుల ఇబ్బందులు వాళ్లు మరువలేదు. అమెరికాలో ఉంటూ నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ఆపదలో ఉన్న వారికి తమ వంతుగా ఏదో ఒక సాయం చేస్తూ ఆపన్న హస్తంగా నిలుస్తున్నారు. పల్లెలపై ప్రత్యేక అభిమానం చాటుతో బత్తినేని బ్రదర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్‌కు చైర్మన్‌గా కన్న తండ్రి బత్తినేని నాగప్రసాదరావును నియమించారు. చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలందరి చేత “శభాష్ బత్తినేని బ్రదర్స్” అంటూ మన్ననలు పొందుతున్నారు.
Read Also- AI-powered Smartphone Tool: అంధత్వానికి చెక్.. గ్లాకోమాను గుర్తించే.. అద్భుతమైన ఏఐ సాధనం రెడీ!
సేవల్లో విద్య, వైద్యానికి ప్రాధాన్యం
బత్తినేని బ్రదర్స్ ప్రకాష్-రాకేష్ లిద్దరు వారు స్థాపించిన బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సేవలను అందిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్య, నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ట్రస్టును ముందుకు తీసుకెళుతున్నారు. మరోవైపు వారు చదువుకున్న విధంగానే చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తామున్నామంటూ వారు స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల కల్పన కోసం విశేష కృషి చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ట్రస్టు ద్వారా విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో విరాళాలతో ఆపన్న హస్తం అందిస్తున్నారు. తల సేమియా వ్యాధి వచ్చిన వారికి ప్రతి 20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాల్సి రావడంతో వారికి రక్తమార్పిడి చేస్తూ మందుల ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.8000 అందిస్తూ వస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థకు రూ.6 లక్షలను విరాళంగా అందించారు. అంతేకాకుండా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సేవా భావాన్ని చాటుకుంటున్నారు. సేకరించిన రక్తాన్ని వివిధ అత్యవసర కేసుల్లో ఉన్న వారందరికీ సరఫరా చేస్తున్నారు. కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు లక్ష విరాళంగా ఇచ్చారు. విద్యార్థులకు సైన్స్ కిట్లను పంపిణీ చేశారు. ప్రతి ఏటా కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలకు లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా పలు పాఠశాలలకు నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తూ.. ఖమ్మం జిల్లాలో ఉన్న 20 పాఠశాలలకు రంగులు వేయిస్తూ విద్యార్థుల చదువుల ఉన్నతి కోసం పాటుపడుతున్నారు. సొంత గ్రామం నారాయణపురం ప్రజల దాహార్తిని తీర్చేందుకు లక్షలాది రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గ్రామాలలో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రైతులకు పురుగు మందులు పిచికారి సమయంలో ఉపయోగపడేలా రక్షణ కిట్లను పంపిణీ చేశారు. తానా సభలకు రూ.35 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఖమ్మంలోని హ్యాపీ హోమ్ కు రూ. 1.75 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ను గడగడలాడించిన హుద్ హుద్ తుఫాన్ బాధితులకు రూ.3.50 లక్షలు సాయం చేశారు. నారాయణపురం పాఠశాలకు ఫర్నిచర్, డిజిటల్ టీవీ, మరికొన్ని పాఠశాలలకు డిజిటల్ టీవీలను అందిస్తూ సౌకర్యాలకు కల్పనలో చేయూతగా నిలుస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ నిర్ధారించే ప్రాథమిక పరీక్షలు నిర్వహించే క్యాంపులను సైతం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
చదువుకున్న వారికి ఉద్యోగ కల్పన
పేద విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చి ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడంతోపాటు ఉచిత వీసా కన్సల్టేషన్, కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు. ఇలా ఒకటా…? రెండా..? అనే తేడా లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలలో ముందుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్నతంగా చదువుకున్న వారికి తాము స్వయంగా స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించే బాధ్యతను బత్తినేని సోదరులు ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read Also- CM Revanth Reddy: సీఎం సంచలన నిర్ణయం.. ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో అది తప్పనిసరి!
విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు
చదువుకున్న వారికి ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్న… మరోవైపు ఉత్తమ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదువుతోనే జీవితం. చదువుకుంటేనే జీవితంలో స్థిరత్వం ఉంటుందంటూ వివరిస్తున్నారు. బత్తినేని సోదరులు కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఖమ్మంలో సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించారు. ఆ కంపెనీల్లో ఇక్కడి యువతకు ఉపాధి కల్పన చేస్తూ అమెరికా కాలమానం ప్రకారం వారితో వీధులు నిర్వహింప చేస్తున్నారు. గతంలో ఖమ్మం జిల్లాతో పోల్చుకుంటే నేడు భక్తినేని సోదరులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించాక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అమెరికా వెళ్లేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. వారికి బ్యాంకులు కూడా విద్యార్థులు ఇస్తుండడానికి ప్రధాన కారణం బత్తినేని సోదరులే. అమెరికా అంటే డాలర్ డ్రీమ్స్ మాత్రమే కాదు… దాని వెనుక మరో కోణం కూడా ఉంటుంది. అందుకు బత్తినేని సోదరుల నేపథ్యం మరో కోణం కూడా ఉంది. అమెరికా వెళ్లే విద్యార్థులకు బత్తినేని సోదరులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అక్కడ ఎవరైనా విద్యార్థులు తెలుసు తెలియకో తప్పులు చేస్తే రక్షించిన దాఖలాలు కోకోల్లలు. ఎల్లలు దాటిన జన్మగడ్డను మరువని భక్తినేని సోదరులు నేటి యువతరానికి ఆదర్శనీయులు.
సొంత లాభం మానుకొని…
ఎంతోమంది ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదిస్తూ వెనకేసుకుంటారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారు సైతం నేటి సమాజంలో దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ బత్తినేని సోదరుల స్టైలే వేరు. సొంతంగా ఆశించే లాభాలు మానుకొని పురుగు వారికి సాయపడాలని దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. సొంత లాభం మానుకోవోయ్… పొరుగు వారికి సాయపడవోయ్.. అన్న గురజాడ అప్పారావు సూక్తిని అక్షరాల పాటిస్తున్నారు బత్తినేని సోదరులు. ఎక్కడ అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసి ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకున్న ఘనత బత్తినేని సోదరులది. ఉన్న ఊరి పై మమకారం తగ్గలేదు పుట్టిన మట్టిని మరువలేదు ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకునేందుకు నడుం బిగిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు నుంచి వివిధ పరికరాలు అందిస్తున్నారు. ఇక్కడ యువత ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలను కల్పించేందుకు ఐటి కంపెనీలతో పాటు ఐటి హబ్ ను సైతం ఖమ్మం జిల్లా కేంద్రంలో స్థాపించి హౌరా అనిపించుకుంటున్నారు.
రాకేష్‌కు స్థానికుల ఘన స్వాగతం
అమెరికా డల్లాస్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించిన బత్తినేని రాకేష్ కు స్థానికులు శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ పరసగాని నాగేశ్వరరావు, వీరబాబు, చంద్రశేఖర్, సైదులు, దారగాని నాగేశ్వర్ రావు, సామినేని నరసింహారావు, కృష్ణ ఘన స్వాగతం పలికారు. ఖమ్మం ఐటి రంగంలో రాణిస్తూ ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా పేదవారికి బత్తినేని చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్న ట్రస్ట్ అధినేత బత్తినేని రాకేష్ నివేస్ నుండి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా ఖమ్మం లో తన ఐటి కంపెనీలో ఘన స్వాగతం పలికి రాకేష్ పై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.