AP Fee Reimbursement
Uncategorized

AP Fee Reimbursement: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్స్ చెక్ చేయండి

AP Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూటమి ప్రభుత్వం (Andhra Pradesh Government) శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేసింది. ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతోన్న స్టూడెంట్స్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) కోసం రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ వెల్లడించారు. త్వరలో మరో రూ.400 కోట్లు ప్రభుత్వ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

పలు దఫాలుగా..
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరి నుంచి పలు దఫాలుగా ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) నిధులు విడుదల చేస్తూ వస్తోంది. తొలి విడతలో దీని కింద ఇప్పటికే రూ.788 కోట్లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించింది. పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు రిలీజ్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: 10th Class Hindi Paper leak: టెన్త్ పేపర్ లీక్ ప్రచారం.. స్పందించిన అధికారులు.. ఏం చెప్పారంటే?

ఒత్తిడి తేవొద్దు
రీయింబర్స్ నిధుల విడుదలపై ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దశల వారీగా బకాయిలను చెల్లిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి గురిచేయకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి ఘటనలు తమ దృష్టి వస్తే సదరు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పాఠశాలకు రానివ్వమని, హాల్ టికెట్లు ఇవ్వమని స్టూడెంట్స్ ను ఇబ్బంది పెడితే సీరియస్ గా తీసుకుంటామని స్పష్టం చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!